అరుదైన ఘనత.. ఆ జాబితాలో క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్నా.. అతని క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గడం లేదు. సెంచరీ బాది మూడేళ్లు అయినా.. తాజా ఐపీఎల్ 2022 సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్నా.. అతన బ్రాండ్ వాల్యూకు వచ్చిన నష్టం ఏం లేదు. మైదానంలో పరుగుల వరద పారించకపోయినా విరాట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయా క్రీడల్లో అత్యధిక సంపాధిస్తున్న టాప్ 100 అథ్లెట్ల జాబితాలో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు.
క్రికెట్ పాటు భారత్ నుంచి ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ఒక్కడికే అవకాశం దక్కింది. ఈ జాబితాలో బాస్కెట్ బాల్ ప్లేయర్ లెబ్రోన్ జేమ్స్ అగ్రస్థానంలో నిలవగా.. ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రెండో స్థానంలో నిలిచాడు. ఇంటర్నేషనల్ బాక్సర్ కెనెలో అల్వారెజ్ ఐదో స్థానంలో నిలవగా.., టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ 8వ స్థానం దక్కించుకున్నాడు. గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ 10వ స్థానంలో నిలవగా.. విరాట్ కోహ్లీ 61వ స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్‌లో సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 19.6 సగటుతో 216 పరుగులు మాత్రమే చేసాడు. ఐపీఎల్‌లో గత పదేళ్లలో తొలిసారిగా విరాట్ కోహ్లీ సగటు 20కి దిగువకు చేరింది. ఇప్పటి వరకు 2009 సీజన్‌లో 27.6 సగటుతో చేసిన 359 పరుగులకే కోహ్లీకి అత్యల్పం. కానీ ఈ సారి కనీసం 300 పరుగులు కూడా చేయలేని స్థితిలో విరాట్ కనిపిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై హాఫ్ సెంచరీ బాదినా ఆ ఇన్నింగ్స్ గొప్పగా ఏం అనిపించలేదు. 53 బంతుల్లో 58 పరుగులతో జట్టుకు భారమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఈ హాఫ్ సెంచరీతో విరాట్ ఫామ్‌లోకి వచ్చాడని అంతా భావించారు. కానీ వారి నమ్మకాన్ని విరాట్ వమ్ము చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications