టర్నింగ్ ట్రాక్ కాదు.. టాస్ అసలే కాదు.. మా విజయ రహస్యం అదే: విరాట్ కోహ్లీ

చెన్నై: స్పిన్-ఫ్రెండ్లీ పిచ్ అంటూ ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు చేస్తున్న విమర్శలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తిప్పికొట్టాడు. స్పిన్ పిచ్ కారణంగానే తాము గెలిచామనడంలో ఎలాంటి అర్థం లేదని, టాస్ కూడా కీలకమైనట్లు తాను ఏ మాత్రం భావించడం లేదన్నాడు. ఇరు జట్లకు ఒకే పరిస్థితులు ఎదురయ్యాయని, తాము సమష్టిగా రాణించి అద్భుత విజయాన్నందుకున్నామని స్పష్టం చేశాడు.
ఇంగ్లండ్‌తో మంగళవారం ముగిసిన సెకండ్ టెస్ట్‌లో భారత్ 317 పరుగుల భారీ తేడాతో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయా అనంతరం మాట్లాడిన విరాట్.. అభిమానుల సమక్షంలో ఈ మ్యాచ్ జరగడం తమ జట్టుకు ఎంతో లాభించిందని, వారి ప్రోత్సాహం, అరుపుల వల్లే తమలో ఉత్సాహం ఉరకలెత్తిందని చెప్పాడు. ఈ బిగ్ విక్టరీ రహస్యం కూడా అదేనన్నాడు.

ప్రేక్షకుల వల్లే..
ప్రేక్షకుల మధ్య ఆడటం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుందని విరాట్ చెప్పుకొచ్చాడు. 'స్వదేశంలో ప్రేక్షకుల్లేకుండా ఫస్ట్ టెస్ట్ ఆడటం చాలా వింతగా అనిపించింది. నిజాయితీగా చెప్పాలంటే తొలి రెండు రోజులు మా శక్తీ సామర్థ్యాలను బయటకు తీయలేకపోయాం. కానీ సెకండ్ ఇన్నింగ్స్ నుంచి అదరగొట్టాం. ప్రేక్షకుల మధ్య ఆడటం ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తుంది. ఈ మ్యాచ్ దానికి ఉదహారణగా నిలుస్తోంది. ఇక చెన్నై అభిమానులకు క్రికెట్‌పై మంచి అవగాహన ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రతీ బౌలర్‌కు బౌలింగ్ చేసే 10-15 నిమిషాల ముందు ప్రేక్షకుల నుంచి మద్దతు అవసరం. ఈ వేడి వాతావారణంలో నేను బౌలింగ్ చేయాలన్నా నాకు వారి ప్రోత్సాహం కావాల్సిందే.

అదేం లేదు..
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు సమంగా సవాళ్లు ఎదురయ్యాయి. కానీ మేం వ్యూహాత్మకంగా, సమష్టిగా రాణించి పై చేయి సాధించాం. టాస్ కూడా పెద్ద ప్రభావం చూపించినట్లు నాకు అనిపించలేదు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా మేం దాదాపు 300 పరుగులు చేశాం. పిచ్‌పై వచ్చే విమర్శలు సరైనవి కావు. పంత్ అద్భుతంగా రాణించాడు. ఆస్ట్రేలియాలో పర్యటనలోనే అతను చాలా కష్టపడ్డాడు. బరువు తగ్గాడు. కీపర్‌గా మెరుగయ్యాడు. దాన్ని ఫలితమే తాజా సిరీస్ ప్రదర్శన. అతను ఇలానే మాససికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అతను ఎంత విలువైన ఆటగాడో మనందరికి తెలిసిందే.

అక్షర్‌కు స్పెషల్..
అక్షర్ పటేల్‌కు ఇది స్పెషల్ మూమెంట్. మొకాలి గాయం లేకుంటే అతనే ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆడేవాడు. అతను చాలా వేగంగా నవ్వుతూ బౌలింగ్ చేస్తాడు. అతను తన కెరీర్‌ను ఇలానే నిర్మించుకుంటాడని ఆశిస్తున్నా. తప్పులను త్వరగా సరిదిద్దుకున్నందుకు చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే గతంలో నేనెప్పుడు తప్పులు చేసింది లేదు. కానీ ఇప్పుడు వాటిని తర్వగా సరిదిద్దుకోవాలనుకుంటున్నా. సెకండాఫ్‌లో అశ్విన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సెకండాఫ్‌లోనే నేను ఔటవ్వద్దని గట్టిగా అనుకున్నాను. డిఫెన్స్‌తో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవాలనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు వెనుదిరిగాల్సి వచ్చింది. తదుపరి పింక్ బాల్ సమరం అంత సులువు కాదనే విషయం తెలుసు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నుంచి మాకు సవాళ్లు ఎదురవ్వడం ఖాయం. అయితే ప్రేక్షకుల నుంచి వచ్చే శక్తి, ఉత్సాహం మాకు చాలా ముఖ్యం'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications