రోహిత్ సెంచరీ.. కోహ్లీ రియాక్షన్..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. కెరీర్‌లో తొలి ఓవర్‌సీస్ శతకాన్ని అందుకున్నాడు. మొయిన్ అలీ వేసిన 64వ ఓవర్ ఐదో బంతిని లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదిన రోహిత్... 204 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. రోహిత్ సెంచరీకి గ్యాలరీలోని ఆటగాళ్లు, కోచ్‌లు స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందనలు తెలిపారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే తానే సెంచరీ చేసినంత ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. రోహిత్, కోహ్లీ మధ్య ఎవడ్రా గొడవలున్నాయంది? ఈ వీడియో చూసి ఆ మాట అనండ్రా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

కోహ్లీ ట్రేడ్ మార్క్ రివ్యూకు..
లార్డ్స్ టెస్ట్‌లో కోహ్లీ ట్రేడ్ మార్క్ రివ్యూకు కీలక జానీ బెయిర్ స్టో ఔటవ్వడంతో రోహిత్ భారత కెప్టెన్‌ను హగ్ చేసుకొని మరి అభినందించాడు. ఈ వీడియో కూడా అప్పట్లో నెట్టింట హల్‌చల్ చేసింది. వాస్తవానికి ఆ మ్యాచ్‌లో కోహ్లీ తీసుకున్న ఒంటెత్తు పోకడ రివ్యూలన్నీ ప్రతికూల ఫలితాలిచ్చాయి. ఆ క్రమంలోనే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్ స్టో రివ్యూను కూడా ఇతర ఆటగాళ్లంతా వారించారు. కానీ కోహ్లీ మాత్రం ఎవరి మాట వినకుండా రివ్యూ తీసుకొని ఫలితం రాబట్టాడు. దాంతో అతన్ని సహచర ఆటగాళ్లంతా అభినందించారు. ఆ క్రమంలోనే రోహిత్ శర్మ హగ్ చేసుకొని మరి మెచ్చుకున్నాడు. ఇదే వారి మధ్య ఉన్న మంచి సాన్నిహిత్యాన్ని తెలియజేస్తుంది.

వన్డే ప్రపంచకప్‌తో మొదలు
2019 వన్డే ప్రపంచకప్ తుది జట్టు విషయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విభేధాలు తలెత్తాయని మొదటిసారి ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలకు బలం చేకూర్చేలా కోహ్లీ, అనుష్క ఇన్‌స్టా ఖాతాలను రోహిత్ అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశమైంది. అలాగే అనుష్క శర్మ కూడా రోహిత్‌తో పాటు అతని సతీమణి రితికాను అన్ ఫోలో చేయడం వీరి మధ్య విభేదాలు నిజమే అనుకునేలా చేశాయి. ఇక మ్యాచులు ఆడేటప్పుడు అనుష్క ఆ చివరన కూర్చొంటే రితిక ఈ చివరన కూర్చొని వీక్షించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడం వల్ల మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే రోహిత్-కోహ్లీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు అనిపించింది. ఇది జట్టుకు చేటు చేస్తుందా? అనే ఆందోళన వ్యక్తమైంది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే అన్ని సెట్ అయినట్లు కనిపిస్తోంది.

పుజారా హాఫ్ సెంచరీ..
మ్యాచ్ విషయానికి వస్తే.. రోహిత్ శర్మ(256 బంతుల్లో 14 ఫోర్లతో ఒక సిక్స్‌తో 127) సెంచరీతో చెలరేగగా.. చతేశ్వర్ పుజారా(127 బంతుల్లో 9 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో భారత్ 90 ఓవర్లలో 3 వికెట్లకు 263 రన్స్ చేసింది. ప్రస్తుతం భారత్ 164 పరుగుల లీడ్ సాధించింది. క్రీజులో విరాట్ కోహ్లీ(21 బ్యాటింగ్), రవీంద్ర జడేజా(5 బ్యాటింగ్) ఉన్నారు. అంతకు ముందు 43/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్(46) తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించి మంచి శుభారంభాన్ని అందించారు. మరోసారి సెంచరీ భాగస్వామ్యం దిశగా దూసుకెళ్తున్న ఈ జోడీని జేమ్స్ అండర్సన్ విడదీశాడు. కీపర్ క్యాచ్‌గా కేఎల్ రాహుల్(46)ను పెవిలియన్ చేర్చాడు..
అనంతరం పుజారా క్రీజులోకి రాగా.. రోహిత్ దూకుడుగా ఆడాడు. దాంతో భారత్ 108/1తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం రోహిత్ శర్మ 145 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం మరింత కమిట్ మెంట్‌తో ఆడిన రోహిత్ శర్మ.. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. మరో ఎండ్‌లో పుజారా సైతం సహకారం అందించడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఈక్రమంలో పుజారా సైతం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక క్రీజులో పాతుకుపోయిన రోహిత్, పుజారాలను రాబిన్సన్ పెవిలియన్‌కు చేర్చాడు.


Click it and Unblock the Notifications
