Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2021: కోహ్లీ, రవిశాస్త్రి నోటీస్ పీరియడ్‌లో ఉన్నారు అందుకే టీమిండియా ఇలా! పేలుతున్న సెటైర్లు!

 Virat Kohli & Ravi Shastri In Notice Period: Reason For Poor Performance T20 World Cup 2021
T20 World Cup : నోటీస్ పీరియడ్‌లో ఉన్న ఉద్యోగుల పని గిట్లనే ఉంటది! || Oneindia Telugu

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం దాదాపు ముగిసింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదివారం తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో కోహ్లీసేన సమష్టిగా విఫలమై న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో టోర్నీలో మూడు మ్యాచ్‌లు గెలిచినా ముందంజ వేయలేని పరిస్థితి నెలకొంది. అద్భుతాలు జరిగితే తప్పా భారత్ సెమీస్ చేరలేదు. అయితే టీమిండియా పరాజయాల కంటే ఓడిన తీరే ఇప్పుడు అభిమానులను తీవ్రంగా బాధించింది. అసలు ఆడుతుంది టీమిండియానేనా? అనే సందేహం కలుగుతోంది. దాంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కొందరూ టీమ్ వైఫల్యాన్ని బీసీసీఐకి అంటగడుతూ విమర్శలు గుప్పిస్తుంటే.. మరికొందరూ ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్నారు.

నోటీస్ పీరియడ్‌లో ఉన్నారు..

అయితే భారత పరాజయాలను ఉద్దేశించి ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. అదేంటంటే.. టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే చివరి టోర్నీ. ఈ టోర్నీ తర్వాత టీ20 సారథ్యం నుంచి తప్పుకుంటానని కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు. మరోవైపు రవిశాస్త్రికి హెడ్ కోచ్ పదవికాలం కూడా ఈ టోర్నీతోనే ముగియనుంది. దాంతో ఈ ఇద్దరూ ప్రస్తుతం నోటిస్ పీరియడ్‌లో ఉన్నారని, అందుకే టీమిండియా ఇలా ఆడుతుందని సెటైర్ పేల్చాడు. ఇక నోటీస్ పీరియడ్‌లో ఉండే ఉద్యోగులు ఎలా పనిచేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్నే పరోక్షంగా ప్రస్తావిస్తూ సదరు నెటిజన్ టీమిండియా పెర్పామెన్స్ ట్రోల్ చేశాడు.

టీమిండియా స్కోర్ కంటే పెట్రోల్ ధర ఎక్కువ..

ప్రపంచకప్‌ టోర్నీల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తిరుగులేని రికార్డున్న టీమిండియా తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైనా.. తర్వాతి మ్యాచ్‌లో రాణిస్తారని అంతా భావించారు. కానీ, కోహ్లీసేన అదే వైఫల్యాన్ని కొనసాగిస్తూ చిత్తుగా ఓటమిపాలైంది. క్రీజులో నిలబడి ఆడాలనే పట్టుదల ఏ ఆటగాడిలోనూ కనిపించలేదు. వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లు షాట్లు ఆడటం పెవిలియన్‌ చేరడం.. ఏదో వచ్చామా.. ఆడామా.. వెళ్లామా అన్నట్లు కనిపించింది. ఈ క్రమంలోనే చివరికి అతి కష్టం మీద 110/7 పరుగులు చేసింది. దాంతో అభిమానులు టీమిండియా బ్యాటింగ్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కోహ్లీసేన కొట్టిన స్కోర్‌.. భారత్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర కంటే తక్కువే అని సెటైర్లు పేల్చుతూ ఫన్నీ మీమ్స్‌ ట్రెండ్ చేస్తున్నారు.

టాస్ గెలవడం నేర్చుకో..

మరోవైపు ఐపీఎల్‌లో రాణిస్తూ.. మెగా టోర్నీల్లో విఫలమవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు భారత ఘోర వైఫల్యానికి ఐపీఎలే కారణమని, దాన్ని బ్యాన్‌ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ నిర్వహణ కోసం కక్కుర్తి పడిన బీసీసీఐ.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను బలి చేసిందని మండిపడుతున్నారు. అసలేం జరుగుతుంది? రా? అయ్యా.. అని గుండె పగిలిన హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. టాస్ ఓడిపోయిన కోహ్లీని డ్రెస్సింగ్ రూమ్‌ను చిత్తక్కొట్టాలనుకుందని ఫన్నీ వీడియోలు షేర్ చేస్తున్నారు. కోహ్లీ గ్రేట్ లర్నింగ్ యాడ్‌ను ప్రస్తావిస్తూ ముందు టాస్ గెలవడం నేర్చుకో అని సెటైర్లు పేల్చుతున్నారు.

చెత్తాటతో..

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. జడేజా (19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ 26 నాటౌట్)నే భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌. తర్వాత న్యూజిలాండ్‌ 14.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్‌ డారిల్‌ మిచెల్‌ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగగా.. విలియమ్సన్‌ (31 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు) అజేయంగా నిలబడి మ్యాచ్ ముగించాడు.

Story first published: Monday, November 1, 2021, 13:13 [IST]
Other articles published on Nov 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+