రికార్డుల రారాజు ప్రస్థానానికి 14 ఏళ్లు.. విరాట్ కోహ్లీ భావోద్వేగం! మళ్లీ ఆ రాజసాన్ని చూస్తామా?

హైదరాబాద్: సమకాలీన క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ అంతా ఒకవైపు.. విరాట్ కోహ్లీ ఒక్కడే ఒక వైపు.. కొన్నెళ్ల క్రితం అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే 'మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లీ ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్ అనేంతా..ఒకప్పుడు సచిన్.. ఇప్పుడు కోహ్లీ అని అందరూ చెప్పుకునేంతా.. ఇప్పిటికే అన్ని ఫార్మాట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ నాయకుడిగా అవతరించాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్ ముఖచిత్రంగా ఎదిగిన ఈ రథ సారథి గురువారంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 14 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ''14 ఏళ్ల క్రితం ఇదే రోజున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టా.. నాకు దక్కిన గొప్ప గౌరవం'' అని ట్వీట్ చేశాడు.

అండర్-19 ప్రపంచకప్ విజయంతో
2008 అండర్-19 ప్రపంచకప్‌కు జట్టుకు సారథ్యం వహించిన కోహ్లీ జట్టును చాంపియన్‌గా నిలిపాడు. సిరీస్‌లో భారీ లక్ష్యాలను బ్యాటుతో అవలీలగా ఛేదిస్తూ, సందర్భానికి తగ్గట్లు బౌలర్లనూ, ఫీల్డర్లనూ మారుస్తూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అండర్-19 ప్రపంచకప్ విజయంతో రాత్రికి రాత్రే భవిష్యత్తు తారగా ముద్ర వేసుకున్నాడు. ఆ వెంటనే ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి పిలుపునందుకున్నాడు. ఆపైన అదే ఏడాది శ్రీలంకతో సిరీస్‌కు సచిన్, సెహ్వాగ్ గాయాల కారణంగా దూరమవడంతో అనూహ్యంగా కోహ్లీకి జట్టులో చేరే అవకాశం లభించింది.

ఫస్ట్ మ్యాచ్‌లో విఫలం..
అలా ఊహ తెలిసినప్పట్నుంచీ భారత్‌కు ఆడాలని తండ్రితో కలిసి కోహ్లీ కన్న కల పందొమ్మిదేళ్ల వయసులో సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే రోజు(2008 ఆగస్టు 18) నెరవేరింది. కానీ ఆ మ్యాచ్‌లో కోహ్లీ విఫలమయ్యాడు. గంభీర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కాకపోతే ఆ సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో కోహ్లీ అర్ధ శతకంతోనే టోర్నీ భారత్ సొంతమైంది. అక్కడితో తన రాత మారిపోయిందనుకున్న కోహ్లీ ఆశ అంత సులువుగా తీరలేదు. తరవాతి సిరీస్‌కు సచిన్, సెహ్వాగ్ అందుబాటులోకి రావడంతో కోహ్లీ జట్టులో చోటు కోల్పోయాడు.

గంభీర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
2009లో భారత్‌లో శ్రీలంక పర్యటించినప్పుడు నాలుగో వన్డేకు గాయంతో యువరాజ్ సింగ్ దూరమయ్యాడు. అతని స్థానంలో కోహ్లీకి అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పటి సహచర ఆటగాడు గౌతమ్ గంభీర్‌తో కలిసి సింగిల్స్ తీస్తూ అతను తన తొలి శతకాన్ని సాధించాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే కోహ్లీ ఆటకు ముగ్దుడైన గంభీర్ తనకు ఇచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని కోహ్లీకి ఇచ్చేసాడు. పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ జట్టులో శాశ్వత సభ్యుడిగా మారాడు. అనతి కాలంలోనే స్టార్ క్రికెటర్‌గా టీమిండియా కెప్టెన్‌గా ఎదిగాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్లాడు. కానీ గత మూడేళ్లుగా అతని ఆటతీరు మసకబారుతూ వచ్చింది. 14 ఏళ్ల కెరీర్‌లో టెస్టులు, వన్డేలు కలిపి 70 సెంచరీలు అందుకున్న కోహ్లీ.. 71వ సెంచరీ కోసం నిరీక్షిస్తున్నాడు. ఎంత మంచిగా ఆడే క్రికెటర్‌కైనా గడ్డు సమయం ఉండడం సహజం. కానీ కోహ్లీ విషయంలో అది ఎక్కువకాలం కొనసాగుతూ వస్తుంది.
ఆసియా కప్‌తో రీఎంట్రీ
ఇటీవలే విండీస్ టూర్‌కు దూరంగా ఉన్న కోహ్లీ.. ఆసియా కప్ 2022 ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఫామ్ అందుకోవడంపై దృష్టి సారించిన కింగ్ కోహ్లీ తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌తో(ఆగస్టు 28న) మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇక 14 ఏళ్ల కెరీర్‌లో కోహ్లి 102 టెస్టుల్లో 8074 పరుగులు, 262 వన్డేల్లో 12,344 పరుగులు, 99 టి20ల్లో 3308 పరుగులు సాధించాడు. వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 సెంచరీలు సాధించిన కోహ్లీ... టి20ల్లో మాత్రం 30 అర్థసెంచరీలు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications