
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లోనే అత్యుత్తమ మ్యాచ్‌ల వివరాలు వెల్లడించాడు. శ్రీలంకతో 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు 2022 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో ఆడిన మ్యాచ్, 2016 ఐపీఎల్ ఫైనల్ తన కెరీర్‌లోనే బెస్ట్ మ్యాచ్‌లని చెప్పుకొచ్చాడు. మాజీ ఆర్‌సీబీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌తో కలిసి విరాట్ కోహ్లీ 360 షోలో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'టెస్ట్ క్రికెట్ ఆడటం, టెస్టుల్లో సెంచరీ చేయడం నాకు ఎంతో ప్రత్యేకం. క్రికెటర్‌గా అభిమానుల ఆదరణ పొందాను. జట్టు కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాణించడాన్ని నేను గర్వంగా ఫీలవుతా. అలా ఆడటం నా అత్యుత్తమ సామర్థ్యం కూడా. ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్‌ల్లో సెంచరీ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఆ సెంచరీ నాకు రిలీఫ్ ఇవ్వడంతో పాటు ప్రశాంతతను ఇచ్చింది. బిగ్ టోర్నీల పట్ల నేనెప్పుడూ ఉత్సాహంగా ఉంటాను.
నాకు నేను సవాల్ చేసుకుంటాను. అదే నాకు ఎక్స్‌ట్రా మోటివేషన్ ఇస్తుంది. వికెట్ల మధ్య నాతో అత్యం వేగంగా పరుగెత్తిన ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ఇద్దరితో సమన్వయం బాగుండేది. కనీసం పిలుపు కూడా ఇచ్చుకోకుండా పరుగెత్తేవాళ్లం. వికెట్ల మధ్య నాతో పరుగెత్తినవాళ్లలో పుజారా అత్యంత చెత్త రన్నర్. ఇలా చెప్పడం వివాదాస్పదం కావచ్చు. కానీ పుజారా 2018 సౌతాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ టెస్ట్‌లో ఓ బ్యాటర్‌ను రనౌట్ చేయడంతో పాటు అతను కూడా రనౌటయ్యాడు. దాంతోనే వరస్ట్ రన్నరని చెబుతున్నా.
గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ వాతావరణం నా కెరీర్‌లోనే ప్రత్యేకం. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వాతావరణ అత్యుత్తమమైనది. 2016 ఐపీఎల్ ఫైనల్‌ను కూడా నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఇక పాకిస్థాన్‌తో 2023 టీ20 ప్రపచంకప్‌లో నేను ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ నా గుండెలోనే ఉంటుంది. ఆ మ్యాచ్ ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కంటే ఎక్కువ. జీవితాంతం నాకు బౌలింగ్ చేయాలనుకునే బౌలర్ డేల్ స్టెయిన్'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియాతో మూడో వన్డే కోసం విరాట్ కోహ్లీ చెన్నైకి వచ్చాడు. బుధవారం చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు వన్డేల్లోనూ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలనుకుంటున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లంతా తమ ఐపీఎల్ టీమ్స్‌తో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నారు. మార్చి 31 నుంచి ధనాధన్ లీగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.