కేన్ మామ రిటైర్మెంట్.. విరాట్ కోహ్లీ భావోద్వేగం
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను ముగించిన కేన్ విలియమ్సన్‌కు విరాట్ కోహ్లీ అభినందనలు తెలిపాడు. ఇప్పుడే జీవితం మొదలైందని, ఆస్వాదించాలని కేన్ మామకు సూచించాడు.
ఇంగ్లండ్ పర్యటన మధ్యలోనే కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. లార్డ్స్ టెస్టు ఓటమి అనంతరం కేన్ మామ వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కొనసాగినందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు.

విరాట్ కోహ్లీ భావోద్వేగం..
కేన్ మామ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విరాట్ కోహ్లీ భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టాడు. 'ఇన్నేళ్ల ప్రయాణంలో ఒక ప్రత్యర్థి నుంచి మంచి స్నేహితుడిగా మారావు. ఇన్నేళ్లుగా నువ్వు బ్యాటింగ్ చేయడం.. నేను నీతో పోటీ పడటం చాలా సంతోషాన్నిచ్చింది. అంతకంటే ఎక్కువగా నీతో ఉన్న స్నేహాన్ని, ఆట గురించి అలాగే ఇతర విషయాల గురించి మనకున్న ఉమ్మడి ఆలోచనలను నేను ఎంతో గౌరవిస్తాను.
మనం మాట్లాడుకున్న ప్రతిసారీ లేదా కలుసుకున్న ప్రతిసారీ ఆ క్షణాలను నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. నీకు ఎప్పుడూ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను మిత్రమా.. నువ్వు చేయాల్సింది చేసావు.. ఇక ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని వీటన్నింటినీ ఆస్వాదించే అర్హత నీకు ఉంది. చాలా బాగా ఆడావు మిత్రమా. చెప్పాలంటే నీ జీవితం ఇప్పుడే మొదలైంది.'అని కోహ్లీ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
అండర్ 19 ప్రపంచకప్ నుంచి..
2008 అండర్-19 ప్రపంచకప్‌తో కోహ్లీ, విలియమ్సన్ క్రికెట్ ప్రపంచానికి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఈ ఇద్దరూ పోటీ పడి పరుగులు సాధించారు. తమ క్లాస్ ఆటతో అభిమానగణాన్ని సొంతం చేసుకున్న ఈ ఇద్దరూ ఫ్యాబ్ 4లో స్టీవ్ స్మిత్, జో రూట్‌తో పాటు చోటు సంపాదించుకున్నారు.
తన 16 ఏళ్ల కెరీర్లో విలియమ్సన్ మూడు ఫార్మాట్లలో కలిపి 378 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 48.12 సగటుతో 19,346 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. 110 టెస్ట్‌ల్లో 33 శతకాలతో 9,515 పరుగులు చేశాడు. 93 టీ20ల్లో 2,575 పరుగులు, 175 వన్డేల్లో 7,256 రన్స్ కొట్టాడు. 2021-23 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కోహ్లీ సారథ్యంలోని టీమిండియాను ఓడించిన కేన్ మామ.. న్యూజిలాండ్‌ను విజేతగా నిలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

