For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టైటిల్ గెలవలేకపోతేనేం.. నువ్వే నా ఆల్‌టైమ్ గ్రేట్! విరాట్ కోహ్లీ భావోద్వేగం!

Virat Kohli pays heartfelt tribute to Cristiano Ronaldo after Portugal’s star tearful exit

న్యూఢిల్లీ: ఫిఫా ప్రపంచకప్ 2022లో పోర్చుగల్ నిష్క్రమణ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. తన ఆరాధ్య ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ లేకుండానే కెరీర్ ముగించాల్సి రావడంపై ట్విటర్ వేదికగా స్పందించాడు. టైటిల్ గెలవకపోయినా.. రొనాల్డోనే తన ఆల్‌టైమ్ గ్రేట్ చాంపియన్ అంటూ పేర్కొన్నాడు. ఈ టైటిళ్లు ఆటగాళ్ల గొప్పతనాన్ని, ఘనతలను తగ్గించలేవని స్పష్టం చేశాడు.

శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనామక టీమ్ మొరాకో 1-0తో బలమైన పోర్చుగల్‌కు చెక్ పెట్టి సెమీస్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో ఖంగుతిన్న రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. ఉబికి వస్తున్న దు:ఖన్ని ఆపుకోలేకపోయాడు. కెరీర్‌లో చివరి వరల్డ్ కప్ ఆడిన రొనాల్డో.. ప్రపంచకప్ టైటిల్ ముద్దాడాలనే కలను నెరవేర్చుకోలేకపోయాడు. పోర్చుగల్ మేనేజ్‌మెంట్ అత్యుత్సాహం ఆ జట్టు కొంపముంచింది. కీలక క్వార్టర్ ఫైనల్లో మొరాకో తక్కువ అంచనా వేసిన ఆ జట్టు.. కెప్టెన్ రొనాల్డోనే పక్కనపెట్టింది. హాఫ్ టైమ్ వరకు బెంచ్‌ మీద కూర్చున్న రొనాల్డో ఆ తర్వాత బరిలోకి దిగిన ఫలితం లేకపోయింది. 90వ నిమిషంలో అతను కొట్టిన పెనాల్టీ కిక్‌ను మొరాకో కీపర్ ఆపడంతో పోర్చుగల్ ఓటమి ఖాయమైంది.

రొనాల్డో కన్నీటి పర్యంతమవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులను కదిలించింది. వెక్కి వెక్కి ఏడ్చిన రొనాల్డోను చూసి వారు తట్టుకోలేకపోయారు. అతనికి అండగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెట్టారు. ఈ క్రమంలోనే రొనాల్డోను తన రోల్ మోడల్‌గా భావించే విరాట్ కోహ్లీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

Virat Kohli pays heartfelt tribute to Cristiano Ronaldo after Portugal’s star tearful exit

'ఏ టైటిల్ కూడా నీ విలువను తగ్గించలేదు. క్రీడల్లో నువ్వు సాధించిన ఘనతలను చెరపలేదు. క్రీడాభిమానులపై ఉన్న నీ ప్రభావాన్ని ఏ ట్రోఫీ కూడా వివరించలేదు. నీ ఆటతో మమ్మల్ని అలరించడమే దేవుడిచ్చి గొప్ప వరం. నీ డెడికేషన్, హార్డ్ వర్క్ మా అందరికి స్పూర్తిదాయకం. టైటిల్ గెలవకపోతేనేం.. నువ్వే నా ఆల్‌టైమ్ గ్రేట్ ఛాంప్'అని విరాట్ భావోద్వేగపూరిత పోస్ట్‌లు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. టెస్ట్ సిరీస్‌కు సమాయత్తం అవుతున్నాడు. బుధవారం నుంచి ఛటోగ్రామ్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

Story first published: Monday, December 12, 2022, 10:51 [IST]
Other articles published on Dec 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+