న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా కంటే అతనే బెస్ట్ ఫీల్డర్.. ఇక ఈ చర్చను ఆపేయండి: కోహ్లీ

Virat Kohli or Ravindra Jadeja? India skipper settles teams best fielder debate

ముంబై: కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ నిలిచిపోవడంతో స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో తమ జీవితంలో ఎన్నడూ దొరకని ఈ విశ్రాంతి సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో టైంపాస్ చేస్తున్నారు. ఇన్‌స్టా లైవ్ సెషన్స్‌లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు.

ఇక మ్యాచ్‌లేవి లేకపోవడంతో క్రికెట్ వెబ్‌సైట్స్ అన్నీ.. ఆటగాళ్ల లైవ్‌సెషన్స్‌.. వారు చెప్పిన ఆసక్తికర వ్యాఖ్యలను రాసుకొస్తున్నాయి. అంతేకాకుండా తమ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వేదికగా రోజుకో ఇంట్రస్టింగ్ పోల్‌తో అభిమానుల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌స్పోర్ట్స్ ఇండియా తన అధికారికి ట్విటర్ ఖాతాలో టీమిండియా బెస్ట్‌ ఫీల్డర్‌ ఎవరనే దానిపై ఓ పోల్ పెట్టింది.

Virat Kohli or Ravindra Jadeja? India skipper settles teams best fielder debate

'ఒకవేళ మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒకే షాట్‌లో స్టంప్స్ కొట్టాలంటే.. అప్పుడు జడేజా, విరాట్‌లో ఎవరిని ఎంచుకుంటారు?'అని ప్రశ్నించింది. దీనికి అభిమానులు తమకుతోచిన సమాధానం చెప్పారు. కొందరు జడేజా పేరు చెప్పగా.. మరికొందరూ విరాట్ పేరు సూచించారు. అయితే ఈ క్వశ్చన్ పోల్ చూసిన భారత కెప్టెన్ మాత్రం జడేజా పేరును సూచించాడు. 'ఎవరైనా జడేజానే ఎంపికచేసుకుంటారు. ఎప్పుడైనా అతనే బెస్ట్ ఫీల్డర్.. ఇక ఈ చర్చను ఆపండి' అని సమాధానమిచ్చాడు. దీంతో ఈ డిబేట్‌‌కు ముగింపు పలికినట్లైంది.

ఇక జట్టు విజయం సాధించాలంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ ముఖ్యం కాదని, ఫీల్డింగ్ కూడా అవసరమని జట్టులో ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగుపరిచిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బాటలోనే కోహ్లీ నడుస్తున్నాడు. ఫిట్‌నెస్ విషయంలో ఆటగాళ్లందరికి స్పూర్తిగా నిలుస్తూ.. ఫీల్డింగ్‌లో కూడా దిబెస్ట్‌గా నిలుస్తున్నాడు. భారత జట్టులో ప్రస్తుతం బెస్ట్‌ఫీల్డర్‌గా కొనసాగుతున్న జడేజా.. మైదానంలో మైమరిపించే ఫీల్డింగ్ విన్యాసాలతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. భారత ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కూడా ఇటీవల జడేజా ఫీల్డింగ్‌ను కొనియాడిన విషయం తెలిసిందే.

నేను చూసిన ఆటగాళ్లలో అతనే పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్: చాపెల్నేను చూసిన ఆటగాళ్లలో అతనే పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్: చాపెల్

Story first published: Thursday, May 14, 2020, 14:35 [IST]
Other articles published on May 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X