
ఇదే చివరి మ్యాచ్ అన్నట్లు..
'నేను ప్రతీ మ్యాచ్‌ను ఇదే ఆఖరి మ్యాచ్ అన్నట్టుగా భావిస్తాను. నా ఆటతీరు పట్ల సంతోషంగా ఉన్నాను. నేను ఎప్పటికీ క్రికెట్ ఆడననే విషయం తెలుసు. కానీ ఇప్పటికైతే ఆనందంగా ఉన్నాను. నా ఆటను ఆస్వాదిస్తున్నాను. జీవితంలో నిరాశకు లోనయ్యావని భావిస్తే.. నిన్ను నువ్వు మరింత ముందుకు తోసే బదులు ఓ రెండు అడుగులు వెనక్కి వేయాలి. గత కొద్ది నెలల్లో ఇది నాకెంతో ఉపయోగపడింది.

అంచనాలు పెరిగితే..
ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో సెంచరీ చేశాను. ఈ మ్యాచ్‌లో దాదాపు చివరి వరకూ బ్యాటింగ్ చేశాను. మెంటల్ ఫ్రెష్‌నెస్ ఇలా ఆడటానికి ఉపకరిస్తోంది. ఫామ్ బాగున్నప్పుడూ.. అంతా బాగుంటుంది. కానీ ఎక్కువ కాలం ఆడుతున్న కొద్దీ.. జనం అంచనాలు పెరిగిపోతాయి. సరిగా ఆడలేకపోతే ఫ్రస్టేషన్‌కు లోనవుతాం. నా విషయంలో అదే జరిగింది. నేను బాగా ఆడలేకపోయాను.. నేను వరస్ట్ ప్లేయర్‌ను.. ఇవన్నీ నేను అంగీకరించాలని భావించాను.
రెండు అడుగు వెనక్కి వేస్తే..
కష్ట కాలంలో నా భార్య అనుష్క, నా సన్నిహితులు.. నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. కొద్ది రోజులు రిలాక్స్ అయ్యాక ఆసియా కప్‌లో ఆడాను. ప్రాక్టీస్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. నిరాశలో ఉన్నప్పుడు మనల్ని మనం మరింత ముందుకు నెట్టే బదులు.. రెండు అడుగులు వెనక్కి వేయాలి. మనం ఎంతో దూరం ప్రయాణించాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి'అని కోహ్లి సూర్యతో చెప్పుకొచ్చాడు.

పరిస్థితులకు తగ్గట్లు..
తన వయసు 34 ఏళ్లు అని గుర్తు చేసిన కోహ్లీ.. ఈ వయసులో మంచి డైట్‌ను ఫాలో కావడం తనకెంతో అవసరమన్నాడు. శ్రీలంకతో తొలి వన్డేలో అదనంగా 30 పరుగులు చేయడం ముఖ్యమని భావించి ఆ దిశగా ఆడానని చెప్పాడు. 'నా సన్నద్ధత, ఉద్దేశం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. నేను బంతిని చక్కగా బాదుతున్నానని అనిపించింది. మేం అదనంగా మరో 25-30 పరుగులు చేయాలని భావించాను. సెకండ్ హాఫ్‌లో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను'అని మ్యాచ్ అనంతరం కోహ్లీ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
