Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమ్మాయిలు.. మీ విజయం పట్ల గర్విస్తున్నాం: విరాట్ కోహ్లీ

Virat Kohli, Mithali Raj congratulates Indian team for qualifying for maiden Womens T20 World Cup final

సిడ్నీ: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జైత్రయాత్ర కోనసాగించిన భారత జట్టు తొలి సారి ఫైనల్ చేరింది. ఇంగ్లండ్‌తో గురువారం జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దవ్వడంతో హర్మన్‌ప్రీత్ సేన నేరుగా ఫైనల్‌కు చేరింది.

2018 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలోనే ఓడిన భారత మహిళలు.. ఈ సారి మాత్రం గ్రూప్-ఎ టాపర్ హోదాలో ఆడకుండానే టైటిల్ ఫైట్‌కు సిద్ధమయ్యారు. ఈ మెగాటోర్నీలో హర్మన్‌సేన
వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి 8 పాయింట్లతో నాకౌట్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇక భారత మహిళలు ఫైనల్ చేరడం పట్ల యావత్ భారతం హర్షిస్తోంది. అమ్మాయిలపై ప్రశంసల జల్లు కురిపిస్తూ టైటిల్ ఫైట్‌కు ఆల్‌ది బెస్ట్ చెబుతోంది. మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు కూడా హర్మన్‌సేనను అభినందిస్తున్నారు.

విష్ యూ ఆల్‌ద లక్..

భారత పురుషుల కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం అమ్మాయిలకు అభినందనలు తెలిపాడు.

‘సెమీఫైనల్ చేరిన భారత మహిళల టీమ్‌కు అభినందనలు. మీ విజయం పట్ల మేమంతా గర్విస్తున్నాం. ఫైనల్లో కూడా మీ జోరు కొనసాగాలి'అని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు.

వరుణుడిపై ఎవరూ గెలవలేరు..

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం తనదైన శైలిలో భారత అమ్మాయిలను కొనియాడాడు. ‘సెమీఫైనల్స్ చూడటం చాలా ఇష్టం. కానీ ఇంద్రదేవత(వరుణుడు)‌పై ఎవరూ గెలవలేరు. ఏదేమైనా ఆఖరి ఫలితం మాత్రం బాగుంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలిచినందుకు ప్రతిఫలమైతే దక్కింది. భారత మహిళలకు అభినందనలు.. ఆదివారం కూడా మీపై ఇలానే ప్రశంసల జల్లు కురువాలని కోరుకుంటున్నా'అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

లక్ష్మన్, సురేశ్ రైనా కూడా..

భారత అమ్మాయిల గెలుపును టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనాలు అభినందించారు. ‘సెమీఫైనల్ కోసం ఆతృతగా ఎదురు చూశా.. మంచి ఫలితం లభించింది. సెమీఫైనల్ చేరిన భారత జట్టుకు అభినందనలు. గ్రూప్ స్టేజ్ కష్టానికి ఫలితం లభించింది. ఫైనల్లో కూడా ఇదే జోరు కొనసాగాలని కోరుకుంటున్నా'అని లక్ష్మణ్ ట్వీట్ చేయగా.. ‘అద్భుత విజయాలందుకున్న భారత మహిళలకు అభినందనలు.. ఇదే జోరు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా'అని రైనా ట్వీట్ చేశాడు.

పాపం ఇంగ్లండ్..

ఇక భారత అమ్మాయిల విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్.. ఓ క్రికెటర్‌గా ఇంగ్లండ్ జట్టును చూస్తే బాధగా ఉందని తెలిపింది. ‘ఓ భారతీయురాలిగా మన అమ్మాయిల జట్టు ఫైనల్‌కు చేరడం సంతోషంగా ఉంది. కానీ ఓ క్రికెటర్‌గా మాత్రం ఇంగ్లండ్ జట్టుకు వచ్చిన పరిస్థితి మాత్రం ఎవరికి రావద్దని భావిస్తున్నా. కానీ ఏం చేస్తాం.. నిబంధనలు అలాంటివి. ఏమైనా అద్భుత విజయాలతో ఫైనల్‌కు చేరిన భారత అమ్మాయిలకు నా అభినందనలు'అని మిథాలీ ట్వీట్ చేసింది.

Story first published: Thursday, March 5, 2020, 14:30 [IST]
Other articles published on Mar 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+