For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐపై రగిలిపోతున్న విరాట్ కోహ్లీ.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం!

Virat Kohli Makes Himself Unavailable For South Africa ODI Series After Captaincy Removal

హైదరాబాద్: వైట్ బాల్ క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఇటీవల టీ20 సారథ్య బాథ్యతలు అందుకున్న రోహిత్ శర్మకే వన్డే కెప్టెన్సీని కూడా అప్పజెప్పింది. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బీసీసీఐ పెద్దలు, సెలెక్షన్ కమిటీ ఈ విషయంపై విరాట్ కోహ్లీతో మాట్లాడి అతనికి 48 గంటల గడువు ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ కోహ్లీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో చివరకు బీసీసీఐ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సైతం విరాట్ కోహ్లీతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చాడు.

 సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం..

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం..

అయితే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని విరాట్ కోహ్లీ తీవ్ర అవమానంగా భావిస్తున్నాడట. తన చుట్టూ ఉంటూనే తన కెప్టెన్సీ పీకేసారని కోహ్లీ రగిలిపోతున్నాడట. ముఖ్యంగా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ తనను తీవ్రంగా మోసం చేశారనే భావనలో విరాట్ ఉన్నట్లు అతని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం తీవ్ర బాధలో ఉన్న కోహ్లీ.. సౌతాఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ అనంతరం భవిష్యత్తుపై దృష్టిసారించాలనుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.

వన్డేల కోసమే కదా..

వన్డేల కోసమే కదా..

వాస్తవానికి 2023 వన్డే ప్రపంచకప్ కోసమే విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీని వదిలేసాడు. తీరికలేని షెడ్యూల్ కారణంగా తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆర్‌సీబీ కెప్టెన్సీని వదిలేసాడు. 2023 వన్డే ప్రపంచకప్ గెలిపించి.. గౌరవంగా కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాలనుకున్నాడు. కానీ బీసీసీఐ మాత్రం కోహ్లీ కెప్టెన్సీపై నమ్మకం లేక రోహిత్ శర్మను నియమించింది. దాంతో విరాట్ కోహ్లీకి పట్టరాని కోపం వచ్చినట్లుంది. అందుకే ముందే సమాచారం ఇచ్చినా.. అతను ఎలాంటి ప్రకటన చేయలేదు. బీసీసీఐ తనపై వేటు వేసిందని అందరికి తెలియాలనే అలా మౌనంగా ఉండిపోయాడు.

కేవలం టెస్టుల్లోనే..

కేవలం టెస్టుల్లోనే..

అవసరమైతే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పి కేవలం టెస్ట్ క్రికెట్‌లో మాత్రమే కొనసాగాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కెప్టెన్సీ కోల్పోయిన విరాట్ కోహ్లీ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో విఫలమైతే జట్టులో చోటు ఉంటుందా? అనేది అనుమానమే. రోహిత్ కెప్టెన్సీలో కోహ్లీకి అలాంటి సపోర్ట్ దొరుకుతుందా? అంటే చెప్పడం కష్టం. వరుసగా విఫలమై జట్టులో చోటు కోల్పోతే మాత్రం విరాట్.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

 రాణిస్తే తిరుగుండదు..

రాణిస్తే తిరుగుండదు..

వన్డే కెప్టెన్‌గా తనపై వేటు వేయడాన్ని అవమానంగా భావిస్తే మాత్రం విరాట్ కోహ్లీకే నష్టం చేస్తుంది. ఇలాంటి అనుభవాలను ఎంతోమంది దిగ్గజాలు ఎదుర్కొన్న విషయాన్ని అతను గ్రహించాలి. కెప్టెన్‌గా వ్యవహరించింది కొంత కాలమే అయినా.. సచిన్‌ ఇబ్బందికర రీతిలోనే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాకు అప్రతిహత విజయాలందించిన పాంటింగ్‌ సైతం వేటును ఎదుర్కోక తప్పలేదు. కాబట్టి వాస్తవాన్ని గ్రహించి కోహ్లీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కోహ్లి ప్రస్తుత పరిస్థితికి కారణం బ్యాటింగ్‌ జోరు తగ్గడమే. దాన్ని ఇప్పుడు గాడిన పెట్టుకోవడమే తన ముందున్న కర్తవ్యం.

Story first published: Friday, December 10, 2021, 10:20 [IST]
Other articles published on Dec 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+