For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ షాట్‌కు కోహ్లీ నోరెళ్లబెట్టాడు (వీడియో)

Virat Kohli left in awe as Rohit Sharma almost clears the ropes with a nonchalant flick shot

హైదరాబాద్: వెస్టిండీస్‌తో గౌహతి వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌండరీల మోత మోగించారు. 323 పరుగుల లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లి (140: 107 బంతుల్లో 21ఫోర్లు, 2సిక్సులు) - రోహిత్ శర్మ (152 నాటౌట్: 117 బంతుల్లో 15ఫోర్లు, 8సిక్సులు) జోడి రెండో వికెట్‌కి అభేద్యంగా 246 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో 42.1 ఓవర్లలోనే భారత్ జట్టు 326/2తో ఘన విజయాన్ని అందుకుంది.

రోహిత్ శర్మ కళ్లుచెదిరే రీతిలో ప్లిక్

క్రీజులో ఉన్నంతసేపూ పోటీపడి బౌండరీలు బాదిన ఈ జోడీ.. ఏ దశలోనూ వెస్టిండీస్‌ బౌలర్లకి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన కీమర్ రోచ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ కొట్టిన ఫోర్.. అభిమానులనే కాదు.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని కెప్టెన్ కోహ్లీని కూడా ఫిదా చేసింది. లెగ్‌ స్టంప్‌ని టార్గెట్‌గా చేసుకుని రోచ్ బంతిని విసరగా.. కొద్దిపాటి పాదాల కదలికతో మిడిల్ స్టంప్‌ లైన్‌పైకి వెళ్లిన రోహిత్ శర్మ కళ్లుచెదిరే రీతిలో ప్లిక్ చేశాడు.

ఛేదనలో 22, కెప్టెన్‌గా 14: తొలి వన్డే విజయంపై కోహ్లీ ఏమన్నాడంటే!

తొలి వన్డేలో గెలిచిన భారత్ జట్టు

తొలి వన్డేలో గెలిచిన భారత్ జట్టు

బ్యాట్ చక్కగా మిడిల్ కావడంతో.. నేరుగా వెళ్లిన బంతి బౌండరీ లైన్‌కి సమీపంలో పడింది. ఈ షాట్‌ చూసి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని కోహ్లి సైతం ఆశ్చర్యపోయాడు. కోహ్లి, రోహిత్ రెండో వికెట్‌కి నెలకొల్పిన 246 పరుగులు భాగస్వామ్యం.. భారత్ తరఫున ఛేదనలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధికం కావడం విశేషం. తొలి వన్డేలో గెలిచిన భారత్ జట్టు ఐదు వన్డేల సిరీస్‌‌ని 1-0తో ఆరంభించగా.. రెండో వన్డే విశాఖపట్నం వేదికగా బుధవారం మధ్యాహ్నం నుంచి జరగనుంది.

 భారీ విజయంతోపాటు పలు రికార్డులను

భారీ విజయంతోపాటు పలు రికార్డులను

భారత్-విండీస్‌ల మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా భారీ విజయంతోపాటు పలు రికార్డులను సొంతం చేసుకుంది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వన్డేల్లో కెప్టెన్‌గా 50 ఇన్నింగ్స్‌లలో 14 సెంచరీలు సాధించాడు. పాంటింగ్‌ (22) తర్వాతి స్థానం అతడిదే. అతను 220 ఇన్నింగ్స్‌లకు అన్ని సెంచరీలు చేశాడు. ఇక రోహిత్‌ శర్మ వరుసగా ఆరో ఏడాది 150+ పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు.

ఆరో ఏడాది రోహిత్‌ 150కి పైగా పరుగులు

ఆరో ఏడాది రోహిత్‌ 150కి పైగా పరుగులు

ఐదు సార్లు ఆ మార్కును అందుకున్న సచిన్‌, నాలుగు సార్లు 150+ పరుగులు సాధించిన డేవిడ్ వార్నర్‌, జయసూర్య, క్రిస్‌గేల్‌, హెచ్‌ ఆమ్లాలను రోహిత్‌ అధిగమించి అగ్రస్థానానికి చేరాడు. 2013 నుంచి వరుసగా ఆరో ఏడాది రోహిత్‌ 150కి పైగా పరుగులు సాధించాడు. ఇందులో మూడు డబుల్‌ సెంచరీలుండటం విశేషం.

1
44266
Story first published: Monday, October 22, 2018, 15:37 [IST]
Other articles published on Oct 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+