Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంజనా లవ్ యార్కర్‌కు బుమ్రా బౌల్డ్.. వెల్లువెత్తిన విషెస్!

Virat Kohli Leads Indian Cricket Fraternity to Wish Newly-Married Jasprit Bumrah And Sanjana Ganesan

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్‌, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా, ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గోవాలో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగ్గా.. పెళ్లి ఫొటోలను బుమ్రా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈరోజు తమ జీవితాల్లో అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నాడు. ఈ కొత్త జంటకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపాడు.

'వివాహబంధంతో ఒక్కటైన మీ ఇద్దరికి అభినందనలు. ఆ దేవుడి ఆశీస్సులు మీకుండాలి. ప్రేమతో మీ కోహ్లీ'విరాట్ కోహ్లీ ట్వీట్ చేయగా.. హ్యాపీ మ్యారిడ్ లైఫ్ అంటూ గబ్బర్ విష్ చేశాడు. ఇక ముంబై ఇండియన్స్ తమ ఆటగాడికి వినూత్నంగా విషెస్ తెలియజేసింది. సంజనా బౌలింగ్‌లో బుమ్రా క్లీన్ బౌల్డ్ అయ్యాడని, వీరు సుఖసంతోషాలతో హాయిగా ఉండాలని ఆశీర్వదించింది. మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా, వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా అందరూ బుమ్రా దంపతులను దీవిస్తూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

అంతకుముందు వివాహబంధంతో తామిద్దరం ఒకటయ్యామని, తమ జీవితాల్లోనే ఇదో అద్భుతమైన రోజని, ఈ శుభవార్తను పంచుకునేందుకు చాలా సంతోషంగా ఫీలవుతున్నామని బుమ్రా తెలిపాడు. 'ప్రేమ.. అది మిమ్మల్ని వెతుక్కొని వస్తే ఎంతో విలువైనది. మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. మేం ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఈరోజు మా జీవితాల్లో అత్యంత సంతోషకరమైన రోజు. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం' అని బుమ్రా క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

Story first published: Monday, March 15, 2021, 19:27 [IST]
Other articles published on Mar 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+