Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ విజయం.. విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే?

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించడంపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో చారిత్రాత్మక విజయాన్నందుకున్న టీమిండియాను సోషల్ మీడియా వేదికగా అభినందించాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌‌తో పాటు ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్‌లపై ప్రశంసల జల్లు కురిపించాడు. గిల్ బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా సత్తా చాటాడని కొనియాడాడు. ఫ్లాట్ వికెట్‌పై సిరాజ్, ఆకాశ్ దీప్ అద్భుత ప్రద్శన కనబర్చారని ప్రశంసించాడు.

'ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్‌కు గొప్ప విజయం. ఫియర్‌లెస్ గేమ్‌తో ఇంగ్లండ్‌ను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టారు. బ్యాట్‌తో పాటు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ సత్తా చాటాడు. జట్టులోని ప్రతీ ఒక్కరు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా ఫ్లాట్‌ పిచ్‌పై మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే.'అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ చేసిన తొలి ట్వీట్ ఇదే కావడంతో ఇది వైరల్‌గా మారింది.

Virat Kohli Lauds India s Historic Edgbaston Win Praises Shubman Gill s Leadership amp amp Pacers Impact

ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతుండగానే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులకే కోహ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కోహ్లీ ఆకస్మిక నిర్ణయం వెనుక కారణం ఏంటనేది మిస్టరీగా మారింది. మానసికంగా అలసిపోవడంతోనే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి తెలిపాడు.

మరో మూడేళ్ల పాటు కోహ్లీ ఆడుతాడని భావించిన ఫ్యాన్స్‌కు అతని నిర్ణయం నిరాశకు గురి చేసింది. కోహ్లీ లేకుండా టీమిండియా.. టెస్ట్‌ల్లో ఎలా ఆడుతుందోననే భయం అభిమానులను వెంటాడింది. కానీ శుభ్‌మన్ గిల్.. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు కెప్టెన్‌గా సత్తా చాటడంతో టీమిండియా చారిత్రాత్మక విజయాన్నందుకుంది.

Take a Poll

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం ముగిసిన మూడో టెస్ట్‌లో భారత్ 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే ఆలౌటైంది. జెమీ స్మిత్(88) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. ఆకాశ్ దీప్(6/99) ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో టీమిండియా 1-1తో సమంగా నిలిచింది. లార్డ్స్ వేదికగా గురువారం నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.

సంక్షిప్త స్కోర్లు:

భారత్ తొలి ఇన్నింగ్స్ 587 ఆలౌట్ (శుభ్‌మన్ గిల్ 269; షోయబ్ బషీర్ 3/167)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 407 ఆలౌట్ (జెమీ స్మిత్ 184 నాటౌట్, సిరాజ్ 6/70)
భారత్ రెండో ఇన్నింగ్స్ 427/6 డిక్లేర్డ్ (శుభ్‌మన్ గిల్ 161, జోష్ టంగ్ 2/93)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 271 ఆలౌట్( జెమీ స్మిత్ 88, ఆకాశ్ దీప్ 6/91)

Story first published: Monday, July 7, 2025, 10:13 [IST]
Other articles published on Jul 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+