సోషల్ మీడియా వేదికగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన ఓ పని తీవ్ర చర్చనీయాంశమైంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్ ఫ్యాన్ పేజీలో ఆమెకు సంబంధించిన హాట్ ఫొటోలను షేర్ చేశారు. అయితే ఈ పోస్ట్‌ను విరాట్ కోహ్లీ లైక్ చేయడంతో పాటు డిస్‌లైక్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. విరాట్ కోహ్లీ.. అవనీత్ కౌర్ అందానికి ఫిదా అయినట్లు ఉన్నాడని, అనుష్క శర్మ కాపురంలో నిప్పులు.. అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. విరాట్ కోహ్లీ లైక్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్స్ క్షణాల్లో వైరల్‌గా మారాయి.
విరాట్ కోహ్లీ లైక్ చేసిన పోస్ట్‌లో అవనీత్ కౌర్ హాట్ ఫొటోలు ఉన్నాయి. గ్రీన్ క్రాప్ టాప్‌తో పాటు ప్రింటెడ్ వ్రాప్ స్కర్ట్ ధరించిన అవనీత్ కౌర్.. చాలా బోల్డ్‌గా ఫోజులిచ్చింది. తన ఎద అందాలతో పాటు తొడలను ఎక్స్‌పోజ్ చేసింది. ఈ అందాలకు ఫిదా అయ్యే విరాట్ కోహ్లీ లైక్ చేశాడని ఫ్యాన్స్ కామెంట్ చేశారు. అనుష్క శర్మను ట్యాగ్ చేస్తూ మరి కోహ్లీపై ఊహాగానాలకు తెరలేపారు. తన తప్పిదాన్ని గుర్తించిన కోహ్లీ.. ఆ పోస్ట్‌ను డిస్ లైక్ చేశాడు. అయినా.. కామెంట్స్ ఆగకపోవడంతో ఇన్‌స్టా స్టోరీలో విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. ఉద్దేశపూర్వకంగా పోస్ట్‌ను లైక్ చేయలేదని, ఇన్‌స్టా అల్గారిథమ్ వల్ల ఇలా జరిగిందని పేర్కొన్నాడు.


'నా ఫీడ్‌ను క్లియర్ చేస్తున్నప్పుడు.. అల్గారిథమ్ పొరపాటు వల్ల ఇది జరిగింది. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదు. అనవసరమైన ఊహాగానాలకు తెరలేపవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అవగాహనకు ధన్యవాదాలు'అని కోహ్లీ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 63.29 సగటుతో 443 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. 10 మ్యాచ్‌ల్లో ఏడు గెలిచి పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరో విజయం సాధిస్తే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కానుంది.