అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ కంటే అతనికే ఎక్కువ జీతం.. ఎంతంటే?

న్యూఢిల్లీ: ఈ తరం ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో అతను సాధించిన ఘనతలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. కెప్టెన్‌గా కూడా కోహ్లీ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. ఇటు ఆటలో.. అటు సంపాదనలోనూ ఈ రన్‌మెషిన్ దూసుకుపోతున్నాడు.
దాంతో క్రికెట్ సారథుల్లో అత్యధిక జీతం అందుకునే కెప్టెన్ ఎవరంటే.. అందరూ టక్కున విరాట్ కోహ్లీ పేరే చెప్తారు. కానీ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ జీతం అందుకునే సారథి ఉన్నాడు. ఈ జాబితాలో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడనే విషయం పెద్దగా ఎవరికి తెలియదు. ఓ సారి కెప్టెన్ల జీతాలపై లుక్కెద్దాం!

జోరూట్ టాప్..
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వేతనం పొందే కెప్టెన్ జోరూట్. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ అయిన రూట్ రూ.8 కోట్ల 97 లక్షల వార్షిక వేతనాన్ని అందుకుంటున్నాడు. ఇక పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు మాత్రం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రూ. కోటీ 75 లక్షల వార్షిక వేతన్నానే అందిస్తుంది. జోరూట్ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే రూ. 7 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకుంటున్నాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో విరాట్ కోహ్లీ ఏ+ గ్రేడ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అత్యంత ధనిక క్రికెట్‌బోర్డు, వరల్డ్ క్లాస్ ప్లేయర్ కోహ్లీ ఇలా రూ. 7 కోట్ల వేతనంతో సెకండ్ ప్లేస్‌లో ఉంటారని ఎవరూ ఊహించి ఉండరు.

మూడో స్థానంలో టిమ్ పైన్
కోహ్లీ తర్వాత ఆస్ట్రేలియా సారథులు ఆరోన్ ఫించ్, టిమ్ పైన్ రూ. 5 కోట్ల 63 లక్షల వేతనాన్ని(1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు) అందుకుంటున్నారు. ఫించ్ పరిమిత ఓవర్ల సారథిగా కొనసాగుతుండగా.. పెయిన్ టెస్ట్ టీమ్ కెప్టెన్ అన్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో సౌతాఫ్రికా సారథులు నాలుగో స్థానంలో నిలిచారు. టెస్ట్ కెప్టెన్ డీన్ ఎల్గర్ రూ.3.2 కోట్లు, లిమిటెడ్ ఓవర్ కెప్టెన్ టెంబా బవునా రూ.2.5 కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్నారు.

కేన్ మామకు కోటిన్నరనే..
న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ రూ.1.77 కోట్ల వేతనం మాత్రమే అందుతుంది. వెస్టిండీస్ సారథుల్లో కీరన్ పొలార్డ్ రూ.1.73 కోట్ల వేతనం తీసుకుంటుండగా.. బ్రాత్‌వైట్ ఏడాదికి రూ.1.39 కోట్ల జీతం అందుకుంటున్నాడు. దాయదీ పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు రూ. 62.40 లక్షల వార్షిక వేతం అందుకుంటున్నాడు. ఇది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జీతం కన్నా 11 రెట్లు తక్కువ. శ్రీలంక సారథులైన దిముత్ కరుణరత్నే రూ. 51.03 లక్షల సాలరీ తీసుకుంటుండగా.. కుశాల్ పెరీరాకు రూ.25 లక్షల వేతనం అందుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications