ఇదెక్కడి అభిమానంరా అయ్యా.. నా గదిలో కూడా నాకు ప్రైవసీ లేకుంటే ఎలా? విరాట్ కోహ్లీ ఫైర్!

పెర్త్: తన హోటల్ రూమ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన గదిలో కూడా తనకు వ్యక్తిగత భద్రత లేకుంటే ఎలా? అని అసహనం వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించే అభిమానం తనకు అక్కర్లేదని స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2022 కోసం ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌తో దుమ్మురేపుతున్నాడు. పాకిస్థాన్‌పై విరోచిత ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయాన్నందించిన విరాట్.. నెదర్లాండ్స్‌పై అదే జోరును కొనసాగించాడు. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం విఫలమయ్యాడు.
కోహ్లీ రూమ్ ఇదేనంటూ వీడియో..
ఫీల్డింగ్‌లోనూ సునాయస క్యాచ్‌ను నేలపాలు చేసి జట్టు ఓటమికి కారణమయ్యాడు. అయితే విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ ఇలా ఉంటుందని ఓ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది. అందులో విరాట్ తన వస్తువులను ఎలా జాగ్రత్తగా పెట్టుకుంటాడో అనే విషయంతో పాటు అతను వాడే ప్రతీ వస్తువు చూపించారు. చివరకు అతని వాష్ రూమ్‌ను కూడా చిత్రీకరించారు. షూస్ కలెక్షన్స్‌తో పాటు అతను వాడే ఫేస్ క్రీమ్స్, కిట్ బ్యాగ్ అన్నీ చూపించారు. హోటల్‌కు సంబంధించిన సిబ్బందే అత్యుత్సాహంతో ఈ పని చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఉన్మాదపు అభిమానం నాకొద్దు..
వ్యక్తిగత స్వేచ్చను హరించేలా ఉన్న ఈ వీడియోను చూసి విరాట్ కోహ్లీ షాక్ అయ్యాడు. వెంటనే ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ వినోదం కోసం ఆటగాళ్లను ఓ వస్తువుగా పరిగణించవద్దని విజ్ఞప్తి చేశాడు. 'అభిమానులు తమ ఫేవరేట్ ఆటగాళ్లను చూసేందుకే, కలిసేందుకు ఉత్సాహం చూపుతారనే విషయం నాకు తెలుసు. వారి ఆసక్తి, ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. అలాంటి అభిమానులను ఎప్పుడూ నేను అభినందిస్తాను. కానీ నా గదికి సంబంధించిన వీడియోను చూసి నేను షాకయ్యాను.

ఆట బొమ్మల్లా పరిగణించవద్దు..
ఇది నా వ్యక్తిగత స్వేచ్చను హరించేలా ఉంది. నా హోటల్ రూమ్‌లో కూడా నాకు ప్రైవసీ లేకుంటే ఎలా? ఇలాంటి ఉన్మాదపు అభిమానాన్ని నేను సహించను. ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్చను హరించడం ఏ మాత్రం భావ్యం కాదు. దయచేసి ఆటగాళ్ల ప్రైవసీని గౌరవించండి. మీ వినోదం కోసం వారిని ఆట బోమ్మల్లా పరిగణించవద్దు'అని అభిమానులను కోరాడు.

కూతురు విషయంలోనూ..
తన కూతురు వామిక విషయంలోనూ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మీడియాపై ఇలానే ఆగ్రహం వ్యక్తం చేశారు. వామిక పుట్టగానే ఆమె ఫొటోలు, వీడియోలు చిత్రీకరించవద్దని, తమ ప్రైవసీని గౌరవించాలని అన్నీ మీడియా సంస్థలకు లేఖ రాశారు. అయినా ఫొటోగ్రాఫర్లు వామికా ఫొటోను క్లిక్‌మనిపించి వారి ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పటికే వారు కనబడితే వెంబడిస్తూనే ఉంటారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications