IPL 2026: రోహిత్ కాదు.. అతనే ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్: కృనాల్ పాండ్యా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఆ జట్టు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్ అని కొనియాడాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 వికెట్లతో స్టన్నింగ్ విక్టరీ అందుకుంది.
కృనాల్ పాండ్యా(46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 73) అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆర్‌సీబీని కృనాల్ ఆదుకున్నాడు.
కోహ్లీ ఉంటే..
ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న కృనాల్ పాండ్యా గతేడాది కూడా ఈ తరహా మ్యాచ్ ఒకటి ఆడినట్లు గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ మ్యాచ్‌లో తనకు అండగా విరాట్ కోహ్లీ ఉన్నాడని గుర్తు చేసుకున్నాడు. టీమిండియాకు ఆడటమే తన లక్ష్యమని, అందుకోసం తీవ్రంగా కష్టపడుతున్నానని చెప్పుకొచ్చాడు.

' గతేడాది కూడా మాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పుడు మేం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయాం. అప్పుడు కూడా నేనే బ్యాటింగ్‌కు వచ్చాను. కానీ ఆ మ్యాచ్‌లో నా ముందు ఒక 'GOAT' నిలబడి ఉన్నాడు. అతని పేరే విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ మరో ఎండ్‌లో ఉన్నప్పుడు పనులు చాలా సులువు అవుతాయి. అతను మైదానంలోకి తీసుకువచ్చే ఆరా, శక్తి మరేదానితోనూ సరితూగవు.
టీమిండియాకు ఆడటమే నా లక్ష్యం..
ఈ మ్యాచ్‌లో నేను కండరాల నొప్పులతో బాధపడ్డాను. ఆ నొప్పులు కాలి పిక్కల దగ్గర మొదలై తొడ కండరాలు, గ్లూట్స్ వరకు వ్యాపించాయి. నా రెండు కాళ్లు తిమ్మిర్లు పట్టేశాయి. కానీ నేను మాత్రం ఏది ఏమైనా.. మైదానం వీడకూడదని అనుకున్నాను. ఆ నొప్పిని భరిస్తూనే నా జట్టు కోసం పోరాడాలని, నా వంతు సహకారం అందించాలని నిశ్చయించుకున్నా.
నేను గతంలోనే చెప్పాను. నాకు ఆరేడేళ్ల వయసున్నప్పటి నుంచే దేశం కోసం ఆడాలనేది నా మొదటి కల. అందులో ఎలాంటి మార్పు లేదు. నా 100 శాతం లక్ష్యం మళ్ళీ భారత్ తరపున ఆడటమే. వచ్చే ఏడాది 2027 ప్రపంచకప్ రాబోతోంది. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను.'అని కృనాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications