ఆ విషయంలో కోహ్లీకి పోటీనే లేదు.. రోహిత్, బాబర్ తలకిందులు తపస్సు చేసినా..!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లోనే కోహ్లీ అంతటి ఫిట్టెస్ట్ ప్లేయర్ ఎవరు లేరు.. అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతని ఆహార్యం చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. ఫిట్‌నెస్‌పై విరాట్ కోహ్లీ ఇంత శ్రద్ద చూపెడుతాడు కాబట్టే అతను ఇంతవరకు గాయపడింది లేదు. గాయంతో జట్టుకు దూరమైంది లేదు. ఈ ఏడాది భారత సెంట్రల్ కాంట్రాక్టు కలిగిన 23 మంది ఆటగాళ్లలో కోహ్లీ మినహా ప్రతీ ఒక్కరు ఏదో గాయం లేదా, ఫిట్‌నెస్ సమస్యలతో ఎన్‌సీఏకు చేరి రిహాబిలిటేషన్ తీసుకున్నారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కోహ్లీ ఒక్కడే ఇప్పటి వరకు ఎన్‌సీఏ తలుపు తట్టలేదట.
ఫిట్టెస్ ప్లేయర్‌గా...
ఇదే విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ ఏంటో తెలియజేస్తుంది. ఈ ఏడాది సౌతాఫ్రికా పర్యటనలో వెన్ను నొప్పితో ఒక మ్యాచ్‌కు దూరమైన విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకు పెద్దగా గాయపడింది లేదు. సూపర్ ఫిట్‌గా ఉన్నాడు కాబట్టే 32 ఏళ్ల వయసులోనూ విరాట్.. మైదానంలో కుర్రాళ్లకు మించి రాణిస్తున్నాడు. అతను కొట్టే క్రికెటింగ్ షాట్లు, వికెట్ల మధ్య పరిగెత్తే వేగం చూస్తే ఆ వయసు కనిపించదు. గంటలు గంటలు ప్రాక్టీస్ చేసినా అలసిపోయినట్లు కనిపించడు. అతనిలో చురుకుదనం ఏమాత్రం తగ్గదు. అతని బాడీ కూడా సిక్స్ ప్యాక్‌తో ఉంటుంది. ఇప్పుడే క్రికెట్‌లోకి వచ్చిన యువ ఆటగాళ్లు సైతం ఫిట్‌నెస్ విషయంలో అతనితో పోటీపడలేరు.

కసరత్తులే కాదు..
జిమ్‌లో కసరత్తులు చేయడం ఒక్కటే కాదు.. పర్ ఫెక్ట్ డైట్ పాటించడంతోనే తానిలా ఉండగలుగుతున్నానంటూ కోహ్లీ చాలాసార్లు చెప్పాడు. ఫిట్ నెస్ కోసం తనకెంతో ఇష్టమైన బటర్ చికెన్, పరోటాను దూరంగా పెట్టాడు. జంక్ ఫుడ్ జోలికి అసలు వెళ్లడు. పాలు, పాల పదార్థాలకు వీలైనంత దూరంగా ఉంటాడు. అతను రోజూ తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు, పప్పు, రోటీ, గుడ్లు, రెండు కప్పుల కాఫీ, పాలకూర, క్వినోవా వంటి ఆహార పదార్థాలను భాగం చేసుకుంటాడు. అయితే ఏవి తిన్నా సరైన మోతాదులోనే తీసుకుంటాడు. కొవ్వును పెంచే వాటిని దగ్గరకు రానీయడు.

ఫిట్‌నెస్‌కా బాప్..
ఇక కోహ్లి వర్కౌట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు ఓ ఫిట్‌నెస్ బుక్‌గా పనికొస్తాయి. వారంలో ఆరు రోజులు వర్కౌట్స్ చేసే విరాట్.. ఒక రోజు శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తాడు. జిమ్‌లో ఎక్కువగా బరువులు ఎత్తడం, స్క్వాట్స్, కార్డియో ఎక్సర్‌సైజులు చేయడానికి ప్రాధాన్యమిస్తాడు. అతడు చేసే ప్రతి కసరత్తు కండరాలను బలంగా మార్చేలా చేస్తాయి. ఈ ఫిట్‌నెస్ లెవల్సే వికెట్ల మధ్య మెరుపు వేగంతో పరుగెత్తడానికి, ఫీల్డ్‌లో చురుగ్గా ఉండటానికి కోహ్లికి పనికొస్తాయి.

తలకిందులు తపస్సు చేసినా..
తాజా ఎన్‌సీఏ రిపోర్ట్ నేపథ్యంలో కింగ్ కోహ్లీపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రపంచంలోనే ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీతో ఎవరూ పోటీపడలేరని కామెంట్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ సారథి బాబర్ ఆజామ్ తలకిందులు తపస్సు చేసినా కోహ్లీ ఫిట్‌నెస్ అందుకోలేరని, ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీకి పోటీనే లేదని ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న కింగ్ కోహ్లీ ప్రపంచకప్ కోసం సన్నదమవుతున్నాడు. ఇటీవలే ఫామ్‌లోకి వచ్చిన అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications