ఆస్ట్రేలియా మీడియాపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కటుంబ సభ్యులను వీడియో తీయవద్దని ఎంత చెప్పినా.. వినకుండా ఆసీస్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంతో కోహ్లీ కన్నెర్ర చేశాడు.
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్‌ను టీమిండియా డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. టెయిలెండర్ల అసాధారణ ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది. దాంతో ఈ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.
నాలుగో టెస్ట్ మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా గురువారం గబ్బా నుంచి మెల్ బోర్న్‌కు చేరుకుంది. మెల్ బోర్న్ విమానాశ్రయానికి సతీమణి అనుష్కశర్మతో పాటు వామికా, అకాయ్‌లతో విరాట్ కోహ్లీ రాగా.. ఆసీస్ మీడియా వారిని టార్గెట్ చేసింది.

తమ పిల్లల ఫొటోలు, వీడియో తీయవద్దని కోహ్లీ ఎంత చెప్పినా.. వినని ఆసీస్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. దాంతో తీవ్ర అసహనానికి గురైన కోహ్లీ.. ఆసీస్ మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగాడు. ఓ మహిళా జర్నలిస్ట్‌ను గట్టిగా మందలించాడు. తీసిన వీడియోను డిలీట్ చేయాలని సూచించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
తమ పిల్లలను మీడియాకు దూరంగా స్వేచ్చగా పెంచాలనుకున్న విరుష్క దంపతులు.. ఇప్పటికే మీడియా చానెళ్లన్నటికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. తమ పిల్లలను ఫొటోలు, వీడియో తీయవద్దని, తమ ప్రైవసీని గౌరవించాలని కోరారు. పాపరాజీలను కూడా స్పెషల్‌గా రిక్వెస్ట్ చేశారు.
సెలెబ్రిటీల పిల్లలమనే విషయం తెలియకుండా స్వతంత్రంగా పెంచాలనుకున్న విరుష్క.. తమ నివాసాన్ని లండన్‌కు మార్చుకున్నారు. ఖాళీ సమయం దొరికితే అక్కడికే వెళ్లి గడుపుతున్నారు. ఈ ఏడాదే అనుష్క శర్మ అకాయ్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కూతురు వామికా 2021లో పుట్టింది.
Indian cricket superstar Virat Kohli has been involved in a fiery confrontation at Melbourne Airport. @theodrop has the details. https://t.co/5zYfOfGqUb #AUSvIND #7NEWS pic.twitter.com/uXqGzmMAJi
— 7NEWS Melbourne (@7NewsMelbourne) December 19, 2024
Virat Kohli questioning Australian Journalist & he was not happy with them because they were filming videos on Kohli's family despite Kohli already told about not making any videos. (7 News). pic.twitter.com/nKtO4WuNDW
— Tanuj Singh (@ImTanujSingh) December 19, 2024
🚨 NOT HAPPY VIRAT KOHLI AT THE AIRPORT 🚨
— Tanuj Singh (@ImTanujSingh) December 19, 2024
- Virat Kohli was upset and not happy with Australian journalists in Melbourne airport. He already said that please don't take any pictures & filming videos on my children but still Australia's Media filming video. (7 News). pic.twitter.com/BmNenxtAsP