ఈ దమ్ములేనిదే ఈ స్థాయికి చేరానా? ఇట్లాంటివి బొచ్చెడు చూసినా: విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: పేలవ ఫామ్‌తో సతమతమవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. విమర్శకులకు గట్టిగా బదులిచ్చాడు. తన 14 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి విషమ పరిస్థితులను చాలా ఎదుర్కొన్నానని తెలిపాడు. ఇలాంటి కష్టాలను ధాటకుండానే ఈ స్థాయికి చేరానా? అని ప్రశ్నించాడు. ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన విరాట్.. ఆ పర్యటన అనంతరం సుదీర్ఘ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో పాటు జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్నాడు. ఈ ఖాళీ సమయంలో ఫ్యామిలీతో గడిపిన విరాట్ అనంతరం తన ఆటపై ఫోకస్ పెట్టాడు.

తీవ్రంగా ప్రాక్టీస్..
ముంబైలో నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరగనున్న మ్యాచ్‌తో మళ్లీ మైదనాంలోకి కోహ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో మాట్లాడిన విరాట్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన ప్రిపరేషన్స్‌కు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు. 'ఇంగ్లండ్‌లో నేను ఔటైన విధానంపై వర్క్ చేయాల్సి ఉంది. ఆ సమస్యను అధిగమించాలి కూడా. అయితే అదే నా సమస్యని మీరు ఎత్తి చూపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సమస్యను అధిగమించడం నాకు సులువైన పని. నేను బాగా ఆడగలననే విషయం నాకు తెలుసు. ఒక్కసారి నేను రిథమ్‌లోకి వచ్చానని ఫీలయితే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాననే విషయం నాకు బాగా తెలుసు.

ఇలాంటివి చాలా చూశా..
ఇది నాకు పెద్ద సమస్యే కాదు. ఇది కేవలం ఇంగ్లండ్‌లోనే జరగలేదు. నేను బాగా ఆడుతున్నానని కూడా అనుకోలేదు. దాంతో నేను హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాననే విషయం నాకు తెలుసు. ఇలాంటి సమస్యలను ధాటకుండానే అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ స్థాయికి చేరలేం. విభిన్నమైన బౌలింగ్‌తో పాటు ఇలాంటి విపత్కర పరిస్థితులను నా కెరీర్‌లో చాలా చూశాను. కాబట్టి ప్రస్తుత దశను అధిగమించడం నాకు కష్టమేం కాదు. ఓ క్రీడాకారుడిగా నా తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలనుకుంటున్నాను.

నా అనుభవాలే నాకు పాఠాలు..
కెరీర్‌లో ఒడిదొడుకులు ఉండటం సహజమేననే విషయం నాకు తెలుసు. ఈ సమస్యను అధిగమిస్తే నేను ఎంతలా నిలకడగా రాణిస్తానో నాకు బాగా తెలుసు. నా అనుభవాలే నాకు పవిత్రమైనవి. ఈ విపత్కర పరిస్థితుల్లో, గతంలో నేను ఎదుర్కొన్న, అలాగే నేను హామీ ఇవ్వగల ఒక విషయం ఏమిటంటే, నేను ఒక వ్యక్తిగా నన్ను ఎన్నడూ గొప్పగా భావించుకోలేదు.'అని విరాట్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications