For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొత్త ఏడాది కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కొత్త ఏడాది(2026) 5 రికార్డులు ఊరిస్తున్నాయి. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్.. కేవలం వన్డే ఫార్మాట్‌తో పాటు ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. తనకు అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్‌లో పాత కోహ్లీలా చెలరిగిన అతను.. సౌతాఫ్రికాపై రెండు శతకాలు, ఒక అజేయ హాఫ్ సెంచరీతో గతేడాదిని ఘనంగా ముగించాడు. అదే జోరును కొత్త ఏడాదిలోనూ కొనసాగిస్తే.. 5 రికార్డులను తన పేరిట లిఖించుకోనున్నాడు.


1. ఐపీఎల్‌లో 9 వేల పరుగులు..

ఈ ఏడాది మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ 9 వేల పరుగుల మైలురాయి అందుకోనున్నాడు. ప్రస్తుతం అతను 259 ఇన్నింగ్స్‌ల్లో 8661 పరుగులతో ఉన్నాడు. మరో 339 పరుగులు చేస్తే ఈ రికార్డ్ కోహ్లీ వశం కానుంది. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కనున్నాడు. అంతేకాకుండా ఒక్క ఫ్రాంచైజీ తరఫునే ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా నిలవనున్నాడు. గత మూడు సీజన్లలో 600 ప్లస్ రన్స్ చేసిన కోహ్లీ.. ఈ రికార్డ్ నమోదు చేయడం పెద్ద కష్టమేం కాదు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 267 ఇన్నింగ్స్‌ల్లో 7046 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Virat Kohli in 2026 Five Historic Records the Indian Legend Could Achieve This Year

2. ఐపీఎల్‌లో 300 సిక్స్‌లు..

ఐపీఎల్‌లో 300 సిక్సర్ల మార్కును చేరుకోవడానికి కోహ్లీ కేవలం 9 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 9 సిక్సర్లు బాదితే.. కోహ్లీ పేరిట ఈ రికార్డ్ నమోదు కానుంది. ఐపీఎల్ చరిత్ర‌లోనే ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా కోహ్లీ నిలవనున్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్(357), రోహిత్ శర్మ(302) విరాట్ కోహ్లీ కంటే ముందున్నాడు.

3. వన్డేల్లో 15 వేల పరుగులు..

అంతర్జాతీయ వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయికి విరాట్ కోహ్లీ 443 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ 296 ఇన్నింగ్స్‌ల్లో 14557 పరుగులు చేశాడు. మరో 443 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 15 వేల పరుగుల మైలు రాయి అందుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలుస్తాడు. ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌ల్లో 18426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

4. సంగక్కర రికార్డ్‌కు ఎసరు..

శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సంగక్కర రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు కోహ్లీ 42 పరుగుల దూరంలో నిలిచాడు. మరో 42 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలుస్తాడు. సంగక్కర మూడు ఫార్మాట్లలో కలిసి 28,016 పరుగులు చేయగా.. 623 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 27,975 రన్స్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగే అప్‌కమింగ్ వన్డే సిరీస్‌లో ఈ రికార్డ్ బద్దలయ్యే అవకాశం ఉంది. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా కూడా కోహ్లీ చరిత్రకెక్కనున్నాడు.

5. 150 హాఫ్ సెంచరీలు..

అంతర్జాతీయ క్రికెట్‌లో 150 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా కూడా కోహ్లీ రికార్డ్ అందుకోనున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 145 అర్థ శతకాలతో ఉన్నాడు. మరో 5 హాఫ్ సెంచరీలు బాదితే ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా నిలవనున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 164 అగ్రస్థానంలో ఉన్నాడు. సెంచరీలను కలిపి లెక్కిస్తే కోహ్లీ 229 సార్లు 50+ రన్స్ చేయగా.. సచిన్ టెండూల్కర్ 264 సార్లు 50 ప్లస్ రన్స్ సాధించాడు.

Story first published: Friday, January 2, 2026, 12:59 [IST]
Other articles published on Jan 2, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+