For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ సాబ్.. ఆ పిల్లోడికి ఇంకా పెళ్లికాలేదు! అక్కడ కొడతావేంది?

Virat Kohli Hits Shubman Gill Inappropriately During Training Session Goes Viral

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టు ఆటగాళ్లతో ఎంతో చనువుగా ఉంటాడు. వారితో సరదాగా ఉంటూ జోకులు కూడా పేల్చుతుంటాడు. అనేక సందర్భాల్లో విరాట్ కోహ్లీ చలాకీతనం రుజువైంది. మ్యాచ్‌ సందర్భంగా కోహ్లీ చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో ప్రత్యర్థి బ్యాటర్లను టీజ్ చేయడం.. బౌలర్లను ఉత్సాహపరుస్తుండటం తరుచూ చూస్తూనే ఉంటాం. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌లో అశ్విన్‌కు హిందీలో సీక్రెట్ చెబుతూ ఖవాజాకు దొరికిపోవడం నవ్వులు పూయించిన విషయం తెలిసిందే.

ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సందర్భంగా కోహ్లీ చేసిన ఓ చిలిపి పని ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో అందర్నీ నవ్వులు పూయిస్తోంది. ప్రాక్టీస్ చేస్తూ సరదాగా కనిపించిన కోహ్లీ సడన్‌గా గిల్‌ వద్దకు వచ్చి అతని జననాంగంపై గట్టి పంచ్ ఇచ్చాడు. ఈ ఊహించని పంచ్‌తో గిల్‌ పెద్దగా నవ్వుతూ ఎగిరి గంతేశాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.

ఈ వీడియోపై అభిమానులు ఫన్నీగా స్పందిస్తున్నారు. 'కోహ్లీ సాబ్ ఏంటీ ఆ పిల్లోడిని అక్కడ కొట్టావ్.. అతనికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. సంసారానికి పనికిరాకుండా చేద్దాం అనుకుంటున్నావా?'అని సెటైర్లు పేల్చుతున్నారు. 'సీనియర్ ఆటగాడిగా బాధ్యతగా ఉండాల్సిన నువ్వు.. ఇలాంటి పనులు చేయడం ఏంటి'అని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ అల్లరి రోజు రోజుకు శృతి మించుతోందని, అనుష్కకు చెప్పి ముకుతాడు వేయించాలని సెటైర్లు పేల్చుతున్నారు.

మూడో రోజు ఆటలో 115 పరుగులతో లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా 26.4 ఓవరల్లో 4 వికెట్లకు 118 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), చతేశ్వర్ పుజారా(74 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియోన్ రెండు వికెట్లు తీయగా.. టాడ్ ముర్ఫీ ఓ వికెట్ పడగొట్టాడు. లేని పరుగుకు ప్రయత్నించి రోహిత్ శర్మ రనౌటయ్యాడు.

అంతకుముందు 61/1 ఓవర్‌నైట్ స్కోర్ మూడో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా.. 31.1 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(7/42) కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్‌కు అశ్విన్ (3/59) మూడు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ తొలి సెషన్‌లోనే ముగిసింది. ట్రావిస్ హెడ్(45), మార్నస్ లబుషేన్(35) రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

Story first published: Monday, February 20, 2023, 14:16 [IST]
Other articles published on Feb 20, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+