ఆర్‌సీబీ జట్టులోకి ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ.. హింట్ ఇచ్చిన మాజీ కెప్టెన్!

ముంబై: సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ మళ్లీ ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టీమ్ తరఫున అతను మళ్లీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేసిన ఏబీ డివిలియర్స్.. గత ఏడాది ఐపీఎల్‌కి కూడా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. కానీ.. వచ్చే ఏడాది ఐపీఎల్‌కి బెంగళూరు టీమ్‌లో ఏబీడీ ఉంటాడని ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హింట్ ఇచ్చాడు.
ఏబీడీని మిస్సవుతున్నా..
బెంగళూరు టీమ్ తర్వాత మ్యాచ్‌ని పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం ఆడనుండగా..ప్లే బోల్డ్ పేరిట ఆర్‌సీబీ ఫ్రాంచైజీ విరాట్ కోహ్లీతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగానే ఏబీ డివిలియర్స్ గురించి విరాట్ కోహ్లీ మాట్లాడాడు. 'ఏబీ డివిలియర్స్‌ని చాలా మిస్ అవుతున్నా. అప్పుడప్పుడు అతనితో నేను మాట్లాడుతున్నా.. అతను కూడా మెసేజ్‌లు చేస్తున్నాడు.

గతంలో ఎప్పుడూ..
ఏబీడీ ప్రస్తుతం అమెరికాలో గోల్ఫ్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అలానే ఆర్‌సీబీ మ్యాచ్‌లను కూడా నిశితంగా వీక్షిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆర్‌సీబీలోకి అతను వస్తాడనుకుంటున్నా.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక మూడు గోల్డెన్ డకౌట్స్‌పై స్పందిస్తూ.. గతంలో ఎప్పుడూ ఇంతటి దయనీయ పరిస్థితులను ఎదుర్కోలేదని చెప్పాడు. నవ్వుతూ ఈ గడ్డుపరిస్థితులను ఫేస్ చేస్తున్నానని, ఆటలో అన్ని అనుభవాలు పొందుతున్నాని చెప్పుకొచ్చాడు.

5162 పరుగులు..
ఇక విరాట్ కోహ్లీ వ్యాఖ్యలతో.. ఏబీ డివిలియర్స్ ఆర్‌సీబీ సపోర్ట్ స్టాఫ్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ సీజన్‌లోనే ఏబీడి ఆర్‌సీబీ మెంటార్‌గా ఉండనున్నాడని ప్రచారం జరిగింది. 2011లో బెంగళూరు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. ఆ టీమ్ తరఫున 150 మ్యాచ్‌లాడి ఏకంగా 4491 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ కెరీర్‌లో 184 మ్యాచ్‌లాడిన ఈ పవర్ హిట్టర్ 5162 పరుగులు చేయడం విశేషం.

ప్లే ఆఫ్స్ దిశగా..
కోహ్లీతో మంచి అనుబంధం ఉన్న ఏబీడీని.. ఆర్సీబీ అభిమానులు కూడా అమితంగా ఇష్టపడుతారు. కానీ.. గత ఏడాది కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై చెప్పగానే.. ఏబీడీ కూడా ఐపీఎల్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటికే 12 మ్యాచ్‌లాడిన బెంగళూరు టీమ్ ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం కానుంది. తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ పంజాబ్, గుజరాత్‌లతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications