Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆటలోనే కాదు.. అందులోనూ టాప్ లేపిన విరాట్ కోహ్లీ!!

Virat Kohli Has 150 Million Followers On Instagram First Indian To Achieve
Virat Kohli Becomes 1st Indian To Reach 150M Followers On Instagram | Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీకి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆట, కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం ఎవరి నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. సోషల్‌ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అది మరోసారి రుజువైంది. ఇన్‌స్టాలో భారత సారథి కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 150 మిలియన్ మార్క్​ను దాటేసింది. దీంతో ఈ మార్కు దాటిన తొలి ఆసియా సెలబ్రెటీగా విరాట్ గుర్తింపు పొందాడు. అంతేకాక తొలి భారతీయుడిగా, తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

150 మిలియన్ ఫాలోవర్స్

150 మిలియన్ ఫాలోవర్స్

ప్రముఖ సోషల్ మీడియా ఇన్​స్టాగ్రామ్​లో 150 మిలియన్ ఫాలోవర్స్ మార్క్​ను తాజాగా విరాట్ కోహ్లీ అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇన్​స్టాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన భారత క్రీడాకారుల జాబితాలో తొలి స్థానంలో కోహ్లీ నిలిచాడు. తొలి ఆసియా సెలబ్రెటీగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఏ క్రికెటర్ కూడా ఇంత ఫాలోయింగ్ కలిగిలేరు.

50 మిలియన్ మార్క్​ను కూడా ఎవరూ అందుకోలేదు. క్రికెట్ ఆటను శాసిస్తున్న టాప్ జట్ల ఆటగాళ్లు సైతం 50 మిలియన్ మార్క్​ను చేరుకోలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, భారత ఓపెనర్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్, కివీస్ సారథి కేన్ విలియంసన్ లాంటి వారు కూడా 50 మిలియన్ మార్క్​ను అందుకోలేకపోయారు.

ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో

ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో

అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల్లో అత్యధిక ఇన్​స్టా ఫాలోవర్లతో అగ్రస్థానంలో దూసుకెళ్తున్నాడు పోర్చుగల్ ఫుట్​బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ప్రస్తుతం రొనాల్డో ఖాతాను అసురించేవారి సంఖ్య 337 మిలియన్లుగా ఉంది. మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్, హాలీవుడ్ స్టార్ ది రాక్‌కు 266 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ 260 మిలియన్లు, నెయ్​మర్ జూనియర్ 160 మిలియన్ల ఫాలోవర్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ నెయ్​మర్‌ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

అలా పిలుస్తున్నందుకు సంతోషంగా ఉంది..సహచరులు చూపుతున్న ప్రేమకు ఆకాశంలో తేలుతున్నా:టీమిండియా పేసర్

ఒక పోస్టుకు రూ.5 కోట్లు

ఒక పోస్టుకు రూ.5 కోట్లు

సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న విరాట్ కోహ్లీకి సంపాదన కూడా అదే రీతిలో ఉంది. ఇన్‌స్టాలో ఒక ప్రమోషనల్ పోస్టుకు కోహ్లీ రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. హాపర్‌హెచ్‌క్యూ 2021 అనే సంస్థ ఇటీవలే 'ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌లిస్ట్‌' పేరుతో ఓ జాబితా విడుదల చేసింది. ఈ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ద్వారా ప్రపంచంలో ఎక్కువగా ఆర్జిస్తున్న ప్రముఖుల పేర్లను వెల్లడించింది. ఇందులో క్రిస్టియానో రొనాల్డొ అగ్రస్థానంలో నిలిచాడు. ఇన్‌స్టాలో తాను చేసే ఒక్కో పోస్ట్‌కు మార్కెటింగ్ ఏజెన్సీల నుంచి రూ.11.92 కోట్లు అందుకుంటున్నాడు.

డబ్ల్యూడబ్ల్యూఈ ప్లేయర్, హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ డ్వేన్‌ జాన్సన్‌ రూ.11.92 కోట్లు తీసుకుంటున్నారు. పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండె మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో టాప్‌-20లో ఉన్న ఏకైక క్రికెటర్‌ కోహ్లీ మాత్రమే. అతను 19వ స్థానంలో నిలిచి రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

23 వేల పరుగులు

23 వేల పరుగులు

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 95 టెస్టులాడి 52.00 సగటుతో 7671 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 23 వేల పరుగులు చేశాడు.

Story first published: Friday, September 3, 2021, 15:55 [IST]
Other articles published on Sep 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+