For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలా పిలుస్తున్నందుకు సంతోషంగా ఉంది..సహచరులు చూపుతున్న ప్రేమకు ఆకాశంలో తేలుతున్నా:టీమిండియా పేసర్

IND vs ENG: Shardul Thakur says Iam pretty happy with my nickname Lord
Shardul Thakur Addresses His Nicknames, Says Happy To Get So Much Love || Oneindia Telugu

ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. టాపార్డర్‌ విఫలమైన చోట శార్దూల్‌ ఇంగ్లిష్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వికెట్లు తీస్తున్న ఓలి రాబిన్‌సన్‌, క్రిస్ వోక్స్‌కు చుక్కలు చూపించాడు. బౌండరీలు, సిక్సులు బాదుతూ వారిని ఒత్తిడిలోకి నెట్టేశాడు. ఈ క్రంమలోనే శార్దూల్‌ 31 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఫిఫ్టీ అనంతరం శార్దూల్‌ ఔట్‌ కాగా.. ఆపై భారత్ 191 పరుగులకు ఆలౌట్ అయింది.

అలా పిలుస్తున్నందుకు సంతోషంగా ఉంది

సూపర్ ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్ ఠాకూర్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు భారత ప్లేయర్స్ కూడా అతడిని ఆకాశానికెత్తుస్తున్నారు. ఈ క్రమంలోనే ఠాకూర్‌కు ముద్దుపేర్లు పెడుతూన్నారు. ఫాన్స్ ముద్దుగా 'లార్డ్' అని పిలుస్తుండగా.. టీమిండియా ప్లేయర్స్ 'బీఫీ' అని అంటున్నారు. ఒకప్పటి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ ఇయాన్‌ బోథమ్‌ ముద్దుపేరు బీఫీ.

ప్రస్తుతం భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ శార్దూల్‌ను అదే పేరుతో పిలుస్తున్నారు. అందుకెంతో సంతోషంగా ఉందని శార్దూల్ తెలిపాడు. బీసీసీఐ పోస్ట్ చేసిన ఓ వీడియోలో మాట్లాడుతూ... 'ఆ రెండు నా ముద్దుపేర్లు. లార్డ్ అని సోషల్ మీడియాలో ఫాన్స్ పిలుస్తున్నారు. బీఫీ అని నా సహచరులు అంటున్నారు. అలా పిలవడం సంతోషంగా ఉంది. జట్టు సభ్యులు చూపుతున్న ప్రేమకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఆకాశంలో తేలుతున్నా. వారు ఆ ముద్దుపేరుతో పిలవాలని అనుకున్నారు' అని అన్నాడు.

ఎవరైనా బాధ్యత తీసుకోవాల్సిందే

ఎవరైనా బాధ్యత తీసుకోవాల్సిందే

'పేసరైనా, బ్యాటరైనా బాధ్యత తీసుకోవాల్సిందే. భారత జట్టుకు ఆడుతున్నప్పుడు ఏదేమైనా అనుకున్న పని పూర్తిచేయాలి. నేనెప్పుడు బ్యాటింగ్‌కు వెళ్లినా.. నా వరకైతే అది సవాలే. నా జట్టు విజయానికి అవసరమైన తలుపులు తెరిచేలా నేను ప్రభావం చూపించాలి. ఏదేమైనా సరే అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాల్సిందే' అని శార్దూల్ ఠాకూర్‌ అంటున్నాడు.

నాలుగో టెస్ట్‌లోనే కాదు ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన టెస్టులోనూ అర్ధ శతకంతో జట్టు గెలుపునకు కృషి చేశాడు. శార్దూల్ ఠాకూర్‌ మంచి ఆల్‌రౌండర్‌. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు.

IND vs ENG: రక్తమోడుతున్నా బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ పేసర్.. ఆ అంకితభావానికి హ్యాట్సాఫ్‌ అంటున్న ఫాన్స్!!

అందుకే జడేజాను ముందుగా పంపించాం

అందుకే జడేజాను ముందుగా పంపించాం

కుడి-ఎడమ కూర్పు కోసమే రవీంద్ర జడేజాను ముందుగా పంపించారని శార్దూల్‌ ఠాకూర్‌ తెలిపాడు. 'ఆ సమయంలో వెళ్లేది రిషబ్ పంతా, రవీంద్ర జడేజానా అన్నది ముఖ్యం కాదు. జడేజా నిలకడగా సహనంతో పరుగులు చేసిన సందర్భాలను మనం చేశాం. కుడి-ఎడమ కూర్పు కోసమే అతడిని ముందుగా పంపించారు' అని చెప్పాడు. భారత కోచింగ్‌ బృందం తనను సాధ్యమైనంత వరకు స్ట్రెయిట్‌గా బంతుల్ని ఆడమని సూచిందని శార్దూల్‌ పేర్కొన్నాడు.

బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుండటంతో ఆ సలహా ఇచ్చారన్నాడు. తాను బాదిన మూడు సిక్సర్లలో ఫుల్‌షాట్‌ ఎంతగానో నచ్చిందన్నాడు. తాము మరీ ఎక్కువ పరుగులు చేయలేదు కాబట్టి ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా ఆలౌట్‌ చేయాల్సి ఉందన్నాడు. అదే జరిగితే మ్యాచ్‌ మరింత రసవత్తరంగా మారుతుందని శార్దూల్‌ వీడియోలో చెప్పుకొచ్చాడు.

రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ

రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ

శార్దూల్‌ ఠాకూర్‌ తన ధనాధన్ బ్యాటింగ్‌తో టెస్ట్‌ల్లో భారత్‌ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీని (31 బంతులు) నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (32 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా శార్దూల్ మరో రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఇయాన్ బోథమ్ (32 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉండగా.. శార్దూల్ దాన్ని అధిగమించాడు. 1986లో ఇదే వేదికగా జరిగిన మ్యాచ్‌లో బోథమ్ ఈ ఫీట్‌ను సాధించాడు.

Story first published: Friday, September 3, 2021, 14:20 [IST]
Other articles published on Sep 3, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+