మరో హాట్‌టాపిక్.. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కోహ్లీ, హార్దిక్!!

మెల్‌బోర్న్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య గురువారం నుంచి మూడో టెస్టు జరగనుంది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు ఒక్కో గేమ్ గెలవడంతో సిరీస్ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల సన్నద్ధత, బలాబలాలు, గెలుపోటముల గురించి సాధారణంగా చర్చ జరుగుతుంది. కానీ వీటికి భిన్నంగా ఆస్ట్రేలియాలో భారత ఆటగాళ్ల కరోనా వైరస్ నిబంధనల ఉల్లంఘనల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లు ఓ రెస్టారెంట్లో భోజనం చేయడం చర్చనీయాంశం కాగా.. మరో విషయం వెలుగులోకి వచ్చింది.
రూల్స్ ఉల్లంఘించిన కోహ్లీ, హార్దిక్:
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లొచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కరోనా వైరస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ 7న కోహ్లీ, హార్దిక్ సిడ్నీలోని బేబీ షాప్‌లో ముఖానికి మాస్కులు ధరించకుండా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలను ఆ హోటల్ యాజమాన్యమే పోస్టు చేయడం విశేషం. 'ఇవాళ మా స్టోర్‌కు ప్రత్యేకమైన అతిథులు వచ్చారు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీషాప్ పోస్టు చేసింది. అక్కడి అభిమానులతో దిగిన ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. కోహ్లీ, హార్దిక్ ఇద్దరూ ఓ ఐదుగురు అభిమానులతో ఫొటోలు దిగారు.

హాట్‌టాపిక్:
మరోవైపు చిన్నపిల్లల బట్టలు, బొమ్మలు కొనడానికి వెళ్లిన విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా బయో బబుల్ రూల్స్ ఉల్లంఘించారని ఓ ఆస్ట్రేలియా దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. తాజాగా ఈ అంశం చర్చనీయాంశమవుతున్నది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, నవదీప్ సైనీ ఓ రెస్టారెంట్లో భోజనం చేయడం శనివారం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై కూడా ఆస్ట్రేలియా మీడియా రాద్దాంతం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి.

ఐసోలేషన్‌లోకి ఐదుగురు క్రికెటర్లు:
రోహిత్ శర్మతో పాటు శుభమన్ గిల్, పృథ్వి షా, నవ్‌దీప్ సైనీ, రిషబ్ పంత్‌లు కొత్త ఏడాది సందర్భంగా మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్‌కు వెళ్లారు. భోజనాలు చేసిన తర్వాత వాళ్లు బిల్లు అడిగితే.. అప్పటికే దాన్ని చెల్లించారని హోటల్ సిబ్బంది తెలిపారు. మీ టేబుల్ వెనుక కూర్చున్న నవల్‌దీప్ సింగ్ అనే వ్యక్తి బిల్లును కట్టేశారని పేర్కొన్నారు. దీంతో మన క్రికెటర్లు సర్‌ప్రైజ్ అయ్యారు. ఆపై పంత్ సదరు అభిమానిని హగ్ చేసుకున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో అప్రమత్తమయిన క్రికెట్ ఆస్ట్రేలియా అందరినీ ఐసోలేషన్‌లోకి పంపింది.

చివరి టెస్ట్‌పై నీలినీడలు:
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలను పాటించమంటే ఇక్కడికి రావొద్దని భారత క్రికెట్ జట్టును క్విన్‌లాండ్స్ ప్రభుత్వం హెచ్చరించింది. న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. సరిహద్దులన్నిటిని మూసివేసింది. చివరి టెస్ట్ కోసం ఇక్కడికి ప్రత్యేక విమానంలో రానున్న ఆసీస్, భారత్ జట్లు తప్పనిసరి 14 రోజుల క్వారంటైన్ ఉండాలని స్పష్టం చేసింది. కానీ టీమిండియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్వారంటైన్ ఉండలేమని చెప్పేసింది. దాంతో ఇరు జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా జనవరి 15 నుంచి జరగాల్సి ఉన్న ఆఖరి టెస్ట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
ISL 2020 21: దూసుకెళుతున్న ఏటీకే.. తొలి విజయాన్ని అందుకున్న ఈస్ట్ బెంగాల్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications