Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RCB:మళ్లీ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్.. రిటైర్మెంట్ ప్రకటించి అనుష్కతో వ్యాపారం చేసుకోమంటున్న ఫ్యాన్స్!

Virat Kohli Golden Duck Vs SRH: Fans Say Get Retired And Stay With Anushka

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో హాఫ్ సెంచరీ బాదిన విరాట్ లయ అందుకున్నాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో గత మ్యాచ్‌లో 33 పరుగులు చేసిన విరాట్.. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రం గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్‌లో విరాట్‌కు ఇది మూడో గోల్డెన్ డక్. ఇందులో రెండు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోనే కావడం గమనార్హం. స్పిన్ ఆడటంలో తీవ్రంగా తడబడుతున్న విరాట్.. మరోసారి స్పిన్నర్‌కే ఔటయ్యాడు.

యువ బౌలర్ చేతిలో..

యువ స్పిన్నర్ జగదీష సుచిత్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ తొలి బంతికే విరాట్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. విరాట్ వైఫల్యం కన్నా అతను ఔటైన తీరే అభిమానులును తీవ్రంగా బాధిస్తోంది. స్పిన్‌ను ఆడటం విరాట్ బలహీనతగా గుర్తించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలి ఓవర్‌నే అంతగా అనుభవం లేని సుచిత్‌కు అందించాడు. కేన్ వ్యూహానికి తగ్గట్లు ఆడాల్సిన విరాట్.. బాధ్యతారాహిత్యంగా ఆడి సింపుల్‌గా కేన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ ఔటైన తీరు క్యాచింగ్ ప్రాక్టీస్‌గా కనిపించిందంటే అతిశయోక్తి కాదు. విరాట్ దారుణ వైఫల్యం కారణంగా ఆర్‌సీబీ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది.

రిటైర్మెంట్ ఇవ్వమని ఫ్యాన్స్ ఫైర్..

విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు అతనికి అండగా నిలిచిన సొంత అభిమానులు కూడా కోహ్లీ ఇలానే చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం కోహ్లీ పనైపోయిందని, రిటైర్మెంట్ ప్రకటించి సతీమణి అనుష్క శర్మతో కలిసి వ్యాపారం చేసుకోమంటున్నారు. ఇంకొందరు మాత్రం సినిమా హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని సూచిస్తున్నారు. క్రికెట్‌ను మాత్రం వదిలేయాలని కామెంట్ చేస్తున్నారు.

కోహ్లీని స్లెడ్జ్ చేయండ్రా..?

విరాట్ కోహ్లీ డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం మైదానంలో అతన్ని ఎవరైనా రెచ్చగొట్టండని సూచిస్తున్నారు. స్లెడ్జింగ్‌తో విరాట్‌ను కవ్విస్తే మళ్లీ పాత కోహ్లీలా చెలరేగుతాడని కామెంట్ చేస్తున్నారు. పరుగుల యంత్రం కాస్త డక్ మిషన్‌గా మారిందని సెటైర్లు పేల్చుతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో విరాట్ కోహ్లీకి ఏది కలిసి రావడం లేదని మరికొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన రోజులను మళ్లీ చూస్తామో లేమోనని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

విరాట్ కోహ్లీ చెత్త రికార్డు..

ఐపీఎల్ 2022 సీజన్‌లో మూడు సార్లు గోల్డెన్ డక్ అయిన విరాట్ కోహ్లీ.. 2014లో కూడా మూడు సార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. ఓ టాపార్డర్ బ్యాటర్ ఇలా రెండు సీజన్లలో గోల్డెన్ డక్ అవ్వడం ఇదే తొలిసారి. అత్యధిక సార్లు గోల్డెన్ డక్ అయిన బ్యాటర్‌గా కోహ్లీ చెత్త రికార్డును నమోదు చేశాడు. అంతేకాకుండా ఒక సీజన్‌లో ఒకే జట్టుపై రెండు సార్లు గోల్డెన్ డక్ అయిన అప్రతిష్టను కూడా విరాట్ తన పేరిట లిఖించుకున్నాడు. విరాట్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన పటీదార్‌తో కలిసి ఫాఫ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ ఇద్దరు భారీ షాట్లు ఆడటంతో ఆర్‌సీబీ పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.

Story first published: Sunday, May 8, 2022, 16:18 [IST]
Other articles published on May 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+