Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ వల్లే ఈ సెంచరీ: విరాట్ కోహ్లీ

Virat Kohli gives credit to Rohit Sharma, Shubman Gill for his century in 1st ODI vs Sri Lanka

న్యూఢిల్లీ: రోహిత్ శర్మ సూపర్ స్టార్ట్‌‌కు లక్ కలిసి రావడంతోనే సెంచరీ సాధించానని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. శ్రీలంకతో తొలి వన్డే‌లో శతక్కొట్టిన కోహ్లీ(87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 113).. ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు. వన్డే ఫార్మాట్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన విరాట్.. 45వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 73వ అంతర్జాతీయ సెంచరీ సాధించి సచిన్ 100 సెంచరీల రికార్డు దిశగా దూసుకెళ్తున్నాడు. భారత ఇన్నింగ్స్ అనంతరం తన సెంచరీపై స్పందించిన విరాట్.. ఓపెనర్ల అద్భుత ఆరంభం వల్లే తన సెంచరీ సాధ్యమైందన్నాడు. విశ్రాంతి తీసుకోవడం కూడా తనకు బాగా కలిసొచ్చిందన్నాడు.

 ఓపెనర్ల వల్లే..

ఓపెనర్ల వల్లే..

'చిన్న విరామం అనంతరం రెండు, మూడు ప్రాక్టీస్ సెషన్స్‌తో ఈ మ్యాచ్‌ ఆడాను. బంగ్లాదేశ్ పర్యటన తర్వాత చాలా ఫ్రెష్‌గా బరిలోకి దిగాను. హోమ్ సీజన్ ఆడటం కోసం ఉత్సాహంగా ఎదురు చూశా. ఓపెనర్లు అద్భుతమైన ఆరంభంతో నేను స్వేచ్చగా ఆడే అవకాశం ఇచ్చారు. ఒకే టెంపోను మెయింటేన్ చేస్తూ సాగిన నా ఇన్నింగ్స్ చాలా సంతోషాన్నిచ్చింది. రెండు క్యాచ్‌లు నేలపాలవ్వడం కూడా నాకు కలిసొచ్చింది. నా సెంచరీ ఇన్నింగ్స్‌లో లక్ కీలక పాత్ర పోషించింది. ఇలాంటి అవకాశాన్నిచ్చిన ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి.

 డైట్ మెయింటేన్ చేయడమే..

డైట్ మెయింటేన్ చేయడమే..

నా ఇన్నింగ్స్ టీమ్ అదనంగా 20 పరుగులు చేయడానికి సహకరించింది. ఎవరైనా 150, 140 పరుగులు చేస్తేనే ఈ లక్ష్యాన్ని చేధించడం కుదురుతుంది. మా బౌలర్ల సత్తాకు ఈ మ్యాచ్ అసలు సిసలు పరీక్షగా నిలవనుంది. ఎందుకంటే డ్యూ ప్రభావం చూపనున్న ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి. నా ఫిట్‌నెస్‌ ప్రధాన సీక్రెట్ సరైన డైట్ మెయింటేన్ చేయడం. ఈ వయసులో తినే ఆహరంపై క్రమశిక్షణ ఉండటం చాలా ముఖ్యం. అది మన ప్రైమ్ షేప్‌ను దెబ్బతినకుండా చూస్తోంది. ఫిట్‌నెస్ జట్టు కోసం 100 శాతం ఆడేలా చేస్తుంది.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

రెండు లైఫ్స్‌తో...

రెండు లైఫ్స్‌తో...

శ్రీలంక ఫీల్డర్లు చేసిన రెండు తప్పిదాలు విరాట్ కోహ్లీకి కలిసొచ్చాయి. హాఫ్ సెంచరీ పూర్తయిన అనంతరం కసున్ రజితా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఇచ్చిన లాలిపాప్ క్యాచ్‌ను వికెట్ కీపర్ నేలపాలు చేయగా.. 81 పరుగుల వద్ద కవర్స్‌లో ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ డసన్ షనక మిస్ చేశాడు. ఈ రెండు అవకాశాలతో చెలరేగిన విరాట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

దుమ్మురేపిన రోహిత్, కోహ్లీ..

దుమ్మురేపిన రోహిత్, కోహ్లీ..

కోహ్లీ సెంచరీతో.. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83), శుభ్‌మన్ గిల్(60 బంతుల్లో 11 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా మూడు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, చమిక కరుణరత్నే, డసన్ షనక, ధనుంజయ డిసిల్వా తలో వికెట్ తీసారు.

Story first published: Tuesday, January 10, 2023, 19:07 [IST]
Other articles published on Jan 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+