T20 World Cup 2021: న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి.. కెప్టెన్ విరాట్ కోహ్లీపై వేటు!

హైదరాబాద్: భారీ అంచనాలతో టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన టీమిండియా ఇంత దారుణంగా విఫలమవుతుందని ఎవరూ ఊహించలేదు. ఐపీఎల్‌లో దుమ్మురేపి మన ఆటగాళ్లు మెగా టోర్నీల్లో చేతులెత్తేసిన విధానం.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీసేన చిత్తయిన తీరును అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నాయి. మెంటార్ మహేంద్ర సింగ్ ధోనీ రాకతో విరాట్ కోహ్లీ టైటిల్ అందిస్తాడని అంతా భావించారు. కానీ జట్టు ఇప్పుడు కనీసం సెమీఫైనల్ కూడా చేరే అవకాశం లేకపోవడంతో వారంత తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఈ మెగా టోర్నీకి ముందే టీ20 ప్రపంచకప్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని కోహ్లీ చెప్పాడు. కానీ ప్రస్తుత టీమ్ వైఫల్యం చూస్తుంటే అతన్ని వన్డే కెప్టెన్సీపై కూడా వేటు పడే అవకాశం ఉంది.

కోహ్లీ కెప్టెన్సీపై వేటు..
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో టీమ్ ప్రక్షాళనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్దపడవచ్చు. బ్యాటింగ్‌లో మునపటి స్థాయి చూపలేకపోతున్న విరాట్ కోహ్లీ కెప్టెన్‌గానూ నిరాశ పరుస్తున్నాడు. అతని సారథ్య వైఫల్యం టీమ్‌ను దెబ్బకొడుతుంది. అసలు ఐసీసీ ఈవెంట్స్‌లో కోహ్లీ ఎందుకు సక్సెస్ అవ్వలేదు? బైలేటరల్ సిరీస్‌ల్లో ఎందుకంత సక్సెస్ సాధించాడు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కోహ్లీ సెలెక్షన్‌లో సహజంగానే స్థిరత్వం కనిపించదు. కివీస్‌తో పోరునే చూస్తే రోహిత్‌కు బదులు ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడించడం ప్రతికూల ప్రభావం చూపించింది.

తప్పుకుంటాడా? తప్పిస్తారా?
రోహిత్‌కు రక్షణ కల్పించాలనుకున్న విరాట్ కోహ్లీ తాము ఒత్తిడిలో ఉన్నామని ప్రత్యర్థికి సిగ్నల్ ఇచ్చాడనే చెప్పొచ్చు. అది సక్సెస్‌పుల్ కెప్టెన్ లక్షణం కాబోదు. ఈ వైఫల్యాలతో టీ20ల్లోనే కాదు వన్డేల్లో కూడా కోహ్లీ కెప్టెన్సీ ముగింపు దశకు వచ్చిందని చెప్పొచ్చు. 2023 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా వన్డేల్లోనూ కోహ్లీ స్థానంలో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు. టీమ్‌కు ఇప్పుడు కొత్త ఆలోచనలతో సరికొత మార్గనిర్దేశం చేసే వ్యక్తి అవసరం. కాబట్టి కోహ్లీ తప్పిస్తారా? తానే తప్పుకుంటాడా? అనేది చూడాలి. కానీ వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును నడిపించేది ఓ కొత్త కెప్టెన్ అనేది మాత్రం వాస్తవం.

కోహ్లీ వ్యాఖ్యలపై విమర్శలు..
ఇక న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత మేం తెగించి ఆడలేకపోయామని కోహ్లీ చెసిన వ్యాఖ్యలు చాలా బలహీనంగా ఉన్నాయని దిగ్గజ క్రికెటర్లు విశ్లేషకులు అంటున్నారు. అలా మాట్లాడటం సారథి లక్షణం కాదని, ఈ క్లిష్ట సమయంలో టీమ్‌లో విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం చాలా ఉందన్నాడు. ఈ పనిని హెడ్ కోచ్ రవిశాస్త్రి, మెంటార్ ధోనీ చేయాలని సూచిస్తున్నారు. ఇక కోహ్లీ తర్వాత టీ20 కెప్టెన్ ఎవరా? అనే ప్రశ్నకు మరో రెండు రోజుల్లో సమాధానం దొరకనుంది.

నయా కెప్టెన్ రోహిత్..
ఇప్పటికే ఈ దిశగా కార్యచరణ చేపట్టిన బీసీసీఐ.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టుతో పాటు కొత్త కెప్టెన్‌ను ప్రకటించనుందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. చేతన్ శర్మ నేతృత్వంలోని ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ సమావేశమై.. కొత్త కెప్టెన్‌తో పాటు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమ్‌ను ఎంపిక చేయనుందని క్రిక్ బజ్ పేర్కొంది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకే సారథ్య బాధ్యతలు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications