Sydney Test: అసలుసిసలైన రౌడీల్లా ప్రవర్తించారు.. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి: కోహ్లీ

ముంబై: ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లపై అక్కడి అభిమానులు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. సిడ్నీ టెస్ట్‌లో శనివారం మూడో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌లపై స్టేడియంలోని ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఆసీస్ అభిమానులు ప్రత్యేకంగా సిరాజ్‌ను ఉద్దేశించి మంకీ అని సంబోధించారు. ఇక నాలుగో రోజు (సోమవారం) ఆటలో కూడా మరోసారి సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకొని ఇంకొంతమంది ఫ్యాన్స్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. దీంతో అన్ని దేశాల క్రికెటర్లు ఆసీస్ ఫ్యాన్స్‌పై మండిపడుతున్నారు.
రౌడీల్లా ప్రవర్తించారు
తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసీస్ అభిమానుల జాత్యహంకార వ్యాఖ్యలపై సీరియస్ అయ్యాడు. అసలుసిసలైన రౌడీ ప్రవర్తనకు ఇది నిదర్శనమని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. 'జాత్యహంకార వ్యాఖ్యలు ఏమాత్రం సహించరానివి. మైదానంలో ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. మళ్లీ గ్రౌండ్‌లో వాటిని చూడడం విచారకరం. ఇది అసలుసిసలైన రౌడీ ప్రవర్తనకు నిదర్శనంగా కనిపిస్తోంది' అని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ఘటనపై విచారణ జరపాలని, మళ్లీ ఇలాంటివి జరగకుండా బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు. పితృత్వ సెలవుపై కోహ్లీ భారత దేశానికి తిరిగి వచ్చిన విషయం తేగలిసిందే.

మీరు చేస్తే వెటకారం.. మా వాళ్లు చేస్తే జాత్యాహంకారం
ఆదివారం జరిగిన ఘటనపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చాలా సీరియస్ అయ్యాడు. 'మీరు చేస్తే వెటకారం.. మా వాళ్లు చేస్తే మాత్రం జాత్యాహంకారం. సిడ్నీలో కొంతమంది ఆస్ట్రేలియా అభిమానులు తీరు మరీ దారుణంగా ఉంది. మంచి టెస్ట్ సిరీస్‌ను నాశనం చేస్తున్నారు' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మరికొంతమంది భారత మాజీలు కూడా జాత్యహంకార వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనను ఆస్ట్రేలియా మాజీలు మైక్ హస్సీ, డేవిడ్ వార్న్‌తో పాటు క్రికెట్ ప్రపంచం మొత్తం తీవ్రంగా ఖండించింది.

మద్యం సేవించిన అభిమానులు
మూడో రోజు ఘటన సద్దుమణగక ముందే నాలుగో రోజు ఆటలో మరోసారి మొహ్మద్ సిరాజ్‌పై నోరు పారేసుకున్నారు మరికొందరు ఆసీస్ అభిమానులు. సిరాజ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వెనుకాల స్టాండ్స్‌లో కూర్చున్న కొంతమంది మద్యం సేవించిన అభిమానులు ఏదో అన్నారు. దీంతో అతడు నేరుగా కెప్టెన్ అజింక్య రహానే దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అంపైర్ పాల్ రైఫిల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన మైదాన సిబ్బంది, పోలీసులు ఆరుగురు ఫ్యాన్స్‌ను బయటకు పంపించేశారు. దీని కారణంగా టీ సమయానికి ముందు ఆట 10 నిమిషాల పాటు నిలిచిపోయింది.

కఠిన చర్యలు తీసుకుంటాం
రేసిజం ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీవ్రంగా పరిగణిస్తోంది. సంబంధిత అభిమానులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన ఆసీస్ క్రికెట్ బోర్డు.. టీమిండియాకు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసి దానిని ట్విటర్లో పోస్ట్ చేసింది. 'ఇలాంటి వివక్షాపూరిత ప్రవర్తనను క్రికెట్ ఆస్ట్రేలియా ఖండిస్తోంది. దీనిపై ఐసీసీ విచారణ ఫలితం కోసం ఎదురు చూస్తోంది. బాధ్యులను గుర్తించిన తర్వాత వేధింపుల నిరోధక కోడ్ ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీర్ఘకాలం నిషేధం, మరిన్ని ఆంక్షలు, న్యూసౌత్‌వేల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటివి చేస్తాం. సిరీస్‌కు ఆతిథ్యమిస్తున్న వ్యక్తులుగా మేము మా ఇండియన్ క్రికెట్ స్నేహితులకు క్షమాపణ కోరుతున్నాం' అని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.
Sydney Test: భారత జట్టుకు క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications