Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ పెటర్నిటీ లీవ్ తీసుకున్నప్పుడు నోరు లేవలేదే.. సునీల్ గవాస్కర్‌పై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్

Virat Kohli fans slam Sunil Gavaskar for hinting at bias in the Indian team

హైదరాబాద్: పెటర్నిటీ లీవ్ తీసుకున్న విరాట్ కోహ్లీని తప్పుబట్టిన భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ పట్ల అంత విద్వేశం ఎందుకని ప్రశిస్తున్నారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పెటర్నిటీ లీవ్ తీసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని, ముంబై ఆటగాడనే గమ్మున ఉన్నావా? అని నిలదీస్తున్నారు. ఇక తన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరిలో తొలి బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఉన్న పళంగా భారత్‌కు తిరిగి వచ్చాడు. అయితే విరాట్ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతిస్తే.. మరికొందరు తప్పుబడుతున్నారు.

గవాస్కర్‌ ఆగ్రహం..

గవాస్కర్‌ ఆగ్రహం..

విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్‌పై తాజాగా స్పందించిన లిటిల్ మాస్టర్.. టీమిండియా మేనేజ్‌మెంట్‌ ద్వంద విధానాలను అవలంభిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తండ్రి కానున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి పితృత్వ సెలవులు ఇచ్చి.. అదే యువ బౌలర్‌ టీ నటరాజన్‌ భార్య పాపకు జన్మనిచ్చినా.. నెట్‌ బౌలర్‌గా అతన్ని ఆస్ట్రేలియాలోనే కొనసాగించడం ఎంతవరకు సమంజసమన్నాడు. కోహ్లీకి ఓ న్యాయం.. నటరాజన్‌కు మరో న్యాయమా? అని బీసీసీఐ తీరును తప్పుబట్టాడు. స్పోర్ట్స్‌ స్టార్‌కు రాసిన ఓ కాలమ్‌లో ఈ పెటర్నిటీ లీవ్ వ్యవహారంపై గవాస్కర్‌ స్పందించాడు.

 ఇదెక్కడి న్యాయం..

ఇదెక్కడి న్యాయం..

‘బీసీసీఐ తీరు పట్ల నటరాజన్ అవాక్కై ఉంటాడు. బహుషా యువ ఆటగాడిననే నోరెత్తకుండా గమ్మున ఉన్నట్లున్నాడు. నటరాజన్ ఇటీవలే తండ్రయ్యాడు. కానీ తన బిడ్డని ఇంకా చూడలేదు. యూఏఈ నుంచి నేరుగా అతడ్ని ఆస్ట్రేలియాకి తీసుకెళ్లారు. టెస్టు జట్టులో లేకపోయినా.. నెట్ బౌలర్‌గా అక్కడే ఉంచుకున్నారు. కోహ్లీకి మాత్రం భారత్‌కు తిరుగొచ్చేందుకు అనుమతిచ్చారు. కోహ్లీకి ఓ న్యాయం.. నటరాజన్‌కు ఇంకో న్యాయమా?. ఒక్కో ఆటగాడికి ఒక్కో రూల్. ఇదీ ఇండియన్ క్రికెట్. ' అని గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. గతంలో స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ ఒక్క మ్యాచ్‌లో రాణించకపోయినా పక్కన పెట్టారని.. అదే బ్యాట్స్‌మెన్‌ విషయంలో అలా చేశారా? అని సన్నీ ప్రశ్నించాడు.

 రోహిత్ తీసుకుంటే అడగలేదే..

రోహిత్ తీసుకుంటే అడగలేదే..

ఇక గవాస్కర్ వ్యాఖ్యలపై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నటరాజన్, విరాట్ కోహ్లీకి ఏమైనా పోలిక ఉందా? అసలు అతను వెళ్తానని టీమ్‌కు విజ్ఞప్తి చేశాడా? గవాస్కర్.. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? రోహిత్ శర్మ పెటర్నిటీ లీవ్ తీసుకున్నప్పుడు నీ నోరు లేవలేదే. ఓహో అతను మీ ముంబై ఆటడగాడనా? అయినా కోహ్లీ అంటే ఎందుకంతా నీకు కుళ్లు, ఈర్ష్యా? నీ మాటలు ఎలా ఉన్నాయంటే కంపెనీ సీఈవో.. కొత్తగా వచ్చిన ఉద్యోగి ఒకరే అన్నట్లు మాట్లాడుతున్నావ్. నటరాజన్ యువ ఆటగాడు. తనకు రాక రాక వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నాడు. కానీ విరాట్ వరల్డ్ క్లాస్ ప్లేయర్. అది తెలుసుకో'అంటూ ట్విటర్ వేదికగా మండిపడుతున్నారు.

గాయంతో ఐపీఎల్ ఆడితే తప్పులేదా?

గాయంతో ఐపీఎల్ ఆడితే తప్పులేదా?

ఇక గాయంతో బాధపడుతూ ఐపీఎల్ ఆడితే తప్పులేదా? అని గవాస్కర్‌ను నిలదీస్తున్నారు. టీమిండియా భవిష్యత్తు సిరీస్‌లను లెక్క చేయకుండా ఫ్రాంచైజీ కోసం రిస్క్ చేసిన రోహిత్‌ను ఒక్క మాట కూడా ఎందుకు అనలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రోహిత్ శర్మ కూడా తన కూతురు పుట్టినప్పుడు ఓ టెస్ట్‌నుస్కిప్ చేశాడని గుర్తు చేస్తున్నారు. నటరాజన్ ఇబ్బంది పడుతున్నాడని నీకు ఏమైనా చెప్పాడా? అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వయసు పెరిగినా బుద్దిలేదని, బోర్డర్-గావస్కర్ ట్రోఫీ పేరు మార్చలని డిమాండ్ చేస్తున్నారు.

Story first published: Thursday, December 24, 2020, 14:14 [IST]
Other articles published on Dec 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+