కర్మ అంటే ఇదే.. మొన్న గంగూలీ.. నేడు చేతన్ శర్మ.. ఇంకొకడు మిగిలాడు! మీమ్స్‌తో కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు!

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా వైఫల్యంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ముందుగా చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై వేటు వేసింది. నూతన సెలక్షన్ కమిటీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. టీ20 ప్రపంచకప్ 2021, ఆసియా కప్ 2022, టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా ఘోరంగా విఫలమవ్వడంతో ఆగ్రహంగా ఉన్న బోర్డు.. సెలెక్షన్ కమిటీపై వేటు వేసింది. జట్టు ఎంపిక సరిగ్గా లేకపోవడంతోనే టీమిండియా రాణించలేకపోయిందనే అభిప్రాయానికి వచ్చిన బీసీసీఐ.. కొత్త సెలెక్షన్ కమిటీని నియమించే పనిలో పడింది. ఇక బీసీసీఐ నిర్ణయంతో విరాట్ కోహ్లీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
ఏడిది క్రితం ఇదే రోజు..
సరిగ్గా ఏడాది క్రితం చేతన శర్మ సెలెక్షన్ కమిటీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. టీ20 కెప్టెన్సీని విరాట్ వదులుకోగా.. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. కెప్టెన్సీకి రాజీనామా చేసే విషయమై పునరాలోచించుకోవాలని కోహ్లికి సూచించామని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపాడు. ఇదే విషయాన్ని చేతన్ శర్మ కూడా చెప్పుకొచ్చాడు.
కర్మ రిపీట్..
ఈ వ్యాఖ్యలను కోహ్లీ ఖండించాడు. తనను ఎవరూ సంప్రదించలేదని, గంటన్నర ముందు మాత్రమే చెప్పారన్నాడు. జనవరిలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిసాక విరాట్ టెస్టు కెప్టెన్సీని కూడా వదిలేశాడు. ఈ క్రమంలోనే కర్మ సిద్దాంతం రిపీట్ అవుతుందని కోహ్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి దిగిపోగా.. తాజాగా చేతన్ శర్మ సెలక్షన్ కమిటీపై బోర్డు వేటు వేయడంతో కర్మ అంటే ఇదేనని కామెంట్ చేస్తున్నారు. 2021 నవంబర్ 18న విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా తప్పిస్తే.. సరిగ్గా మరుసటి ఏడాది అదే రోజున చేతన్ శర్మపై బీసీసీఐ వేటు వేసిందని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
రోహిత్ ఒక్కడు మిగిలాడు..
'ఇప్పుడు గంగూలీ, చేతన్ శర్మ ఇద్దరూ లేరు.. విరాట్ కోహ్లి మళ్లీ ఫామ్‌లోకి వచ్చి టాప్‌లో ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ కూడా టీ20 కెప్టెన్సీని పోగొట్టుకునేలా ఉన్నాడు' అని విరాట్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. నూతన సెలక్షన్ కమిటీ వచ్చే ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టనుంది. అప్పట్లో విరాట్ సూచించినట్లుగా కొత్త సెలెక్షన్ కమిటీ వేర్వేరు కెప్టెన్లను నియమించే అవకాశం ఉంది. టీ20లకు హార్దిక్ పాండ్యా.. వన్డే, టెస్ట్‌లకు రోహిత్ శర్మను సారథిగా కొనసాగించనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications