For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మీ తప్పిదం మాకు నష్టం చేసింది.. ఇంకోసారి రీపీట్ కావొద్దు.. డీఆర్ఎస్ డ్రామాపై కోహ్లీ వార్నింగ్

Virat Kohli explains late DRS call against Matthew Wade in 3rd T20I Against Australia
Ind vs Aus 2020,3rd T20I : Virat Kohli Opens Up On DRS Controversy In 3rd T20I

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ వేడ్ ఔట్ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరిన డీఆర్ఎస్‌ను అంపైర్ తిరస్కరించడంపై తీవ్ర వివాదాస్పమైంది. మైదానంలోని బిగ్‌స్క్రీన్‌పై రిప్లే వచ్చిన తర్వాత డీఆర్‌ఎస్ కోరారని కోహ్లీ సమీక్షను తిరస్కరించారు. దాంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మాథ్యూవేడ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80) చేలరేగి ఆసీస్‌కు 186 పరుగుల భారీ స్కోర్ అందించగా.. లక్ష్యచేధనలో తడబడిన భారత్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఇక కోహ్లీ కోరిన సమీక్షను తిరస్కరించకుండా ఉంటే.. మాథ్యూవేడ్ 50 పరుగుల వద్దే మైదానాన్ని వీడేవాడు. ఈ తప్పిదం భారత్ విజయవకాశాలను దెబ్బతీసింది. మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై వివరణ ఇచ్చిన కోహ్లీ.. ఈ తప్పిదం తమకు నష్టం చేసిందన్నాడు.

అసలు విషయం ఏంటంటే?

అసలు విషయం ఏంటంటే?

ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో నటరాజన్ వేసిన నాలుగో బంతి జోరు మీదున్న మాథ్యూ వేడ్ ప్యాడ్లకు తాకింది. దాంతో భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. ఈ సమయంలో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ బౌలర్‌కు దూరంగా ఉండటంతో రివ్యూ కోరడం ఆలస్యమైంది. క్లోజ్‌డ్‌ కాల్‌గా భావించిన విరాట్ రివ్యూ కోరాడు.

కానీ అప్పటికే ఈ బాల్‌కు సంబంధించిన రిప్లే మైదానంలోని స్క్రీన్‌పై వచ్చేసింది. మాథ్యూ వేడ్ ఔట్ అనే విషయం స్పష్టంగా కనిపించింది. దాంతో అంపైర్లు విరాట్ రివ్యూను తిరస్కరించారు. దీనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లీ.. అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. కానీ వారు తమ నిర్ణయానికే కట్టుబడి ఉండటంతో చేసేదేమిలేక వెనక్కి తగ్గాడు.

టీవీ సెక్షన్ తప్పు..

టీవీ సెక్షన్ తప్పు..

మ్యాచ్ తర్వాత డీఆర్ఎస్‌ వివాదంపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ‘‘బంతి వికెట్లపైకి వెళ్లిందా లేదా దూరంగా వెళ్లిందా అని మేము చర్చిస్తుండగా.. 15 సెకన్ల లోపే రిప్లైని స్క్రీన్‌పై ప్రదర్శించారు. మేము గడువులోపు నిర్ణయించుకుని డీఆర్‌ఎస్ కోరాం. కానీ.. అంపైర్ తిరస్కరించాడు. అయితే.. తప్పు చేసింది టీవీ సెక్షన్ వారు. అంతర్జాతీయ క్రికెట్ స్థాయిలో ఇలాంటి తప్పిదాలు చేయకూడదు. ఆ తప్పు టీమిండియాకి చాలా నష్టం చేకూర్చింది'అని వెల్లడించాడు.

టైమర్ ఇవ్వకుండా రీప్లే..

టైమర్ ఇవ్వకుండా రీప్లే..

అయితే ఇక్కడ రివ్యూ తీసుకోవడానికి గల టైమర్ ఇవ్వకుండా రీప్లే ఎందుకిచ్చారనే ప్రశ్న తలెత్తుంది. మాజీ క్రికెట్లరు విశ్లేషకులు కూడా ఈ అంశాన్నే ప్రస్తావిస్తున్నారు. రీప్లే వచ్చాక రివ్యూకు అంగీకరించవద్దని, కానీ అంత తర్వగా రీప్లే ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అసలు నిర్ధిష్ట సమయం ముగిసిన తర్వాత రీప్లే ఇచ్చారా? లేక ముందే ఇచ్చారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ‘సరైన నిర్ణయం తీసుకున్నారు. బిగ్ స్క్రీన్‌లో రీప్లే వచ్చిన తర్వాత రివ్యూకు ఆస్కారం లేదు. కానీ ఈ రీప్లే నిర్థిష్ట సమయానికి ముందే వచ్చిందా? లేక 15 సెకండ్ల తర్వాత వచ్చిందా? అనేదే ప్రశ్న'అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.

కోహ్లీ పోరాడినా..!

కోహ్లీ పోరాడినా..!

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. మాథ్యూవేడ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80), గ్లేన్ మ్యాక్స్‌వెల్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సుంధర్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, ఠాకుర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులే చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(61 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85) ఒంటరి పోరాటం వృథా అయింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్వెప్సన్ (3/23) భారత పతనాన్ని శాసించగా.. మ్యాక్స్‌వెల్, అబాట్, టై, జంపా తలో వికెట్ తీశారు.

Story first published: Wednesday, December 9, 2020, 11:04 [IST]
Other articles published on Dec 9, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+