మిత్రమా.. నువ్వు నాకు ఇష్టమైన బ్యాటింగ్ పార్టనర్‌వి: విరాట్ కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్నిరకాల ఆటకు వీడ్కోలు పలికిన టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభినందనలు తెలియజేశాడు. తనకు అత్యంత ఇష్టమైన బ్యాటింగ్ పార్ట్‌నర్ రహానే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. రిటైర్మెంట్ తర్వాతి జీవితం మరింత సాఫీగా ముందుకు సాగాలని సోషల్ మీడియా వేదికగా కోహ్లీ పోస్ట్ పెట్టాడు.
'జింక్స్(రహానే).. నీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు మిత్రమా. నువ్వు భారత క్రికెట్‌కు ఎంతో చేశావు. నీ ప్రయాణానికి నువ్వు చాలా గర్వపడవచ్చు. స్లిప్‌లో అత్యంత నమ్మకైమన ఫీల్డర్‌వి. నాకు అత్యంత ఇష్టమైన టెస్ట్ బ్యాటింగ్ పార్ట్‌నర్‌వి. నీకు ఎప్పుడూ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఉంటాయి.'అని విరాట్ కోహ్లీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. రహానేతో కలిసి దిగిన మైదానంలోని ఫొటోను పంచుకున్నాడు.

టెస్ట్‌ల్లో విరాట్ కోహ్లీకి డిప్యూటీగా అజింక్యా రహానే మూడేళ్లు వ్యవహరించాడు. 2018-19లో కోహ్లీ సారథ్యంలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తొలి టెస్ట్ సిరీస్ సాధించడంలో రహానే కీలక పాత్ర పోషించాడు. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కోహ్లీ గైర్హాజరీలో అద్భుతంగా రాణించి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ సారథ్యంలోని భారత్ తొలి టెస్ట్ ఓడగా.. తర్వాతి నాలుగు మ్యాచ్‌లకు వ్యక్తిగత కారణాలతో విరాట్ దూరమయ్యాడు. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియాను నడిపించిన రహానే రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-1తో సిరీస్ సొంతం చేసుకున్నాడు.
రహానేకు కోహ్లీతో పాటు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, పీవీ సింధు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. భారత్ తరఫున రహానే 85 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలతో 5077 పరుగులు చేశాడు.
ఇక 90 వన్డేల్లో 2962 పరుగులు చేయగా.. మూడు సెంచరీలు, 24 హాఫ్ సెంచరీల ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో 20 మ్యాచ్‌లు ఆడి 375 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది.ఐపీఎల్‌లో 212 మ్యాచ్‌లు ఆడి 5367 పరుగులు చేశాడు. అజింక్యా రహానే కోచ్‌గా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

