Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ టాప్ లేపిన విరాట్ కోహ్లీ!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి టాప్ లేపాడు. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. కేవలం వన్డే ఫార్మాట్‌‌లో మాత్రమే కొనసాగుతున్నా.. అతని క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధికంగా వెతికిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.

ముఖ్యంగా క్రీడా విభాగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితాలో ఒకడిగా నిలిచిన కోహ్లీ.. గ్లోబల్ ఐకాన్‌గా తన బ్రాండ్ విలువను మరోసారి చాటుకున్నాడు. టీ20, టెస్ట్ ఫార్మాట్‌కు దూరమైన కోహ్లీ.. ఎక్కువ కాలం ఇంటికే పరిమితమయ్యాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మెరుగైన ప్రదర్శన చేసిన కోహ్లీ.. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. తన 18 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అవ్వడం అదే తొలిసారి కావడంతో ట్రెండింగ్‌లో నిలిచాడు.

Virat Kohli Emerges as the Most Searched Indian Worldwide on Google in 2025

మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన కోహ్లీ.. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేయడంతో పాటు ఒక హాఫ్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోనూ సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించి వార్తల్లో నిలిచాడు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కూడా కైవసం చేసుకున్నాడు. దాంతో నెటిజన్లు కోహ్లీ గురించి విపరీతంగా శోధించారు. సోషల్ మీడియా ఫాలోయింగ్‌లోనూ, గూగుల్ సెర్చ్‌లలోనూ కోహ్లీకి ఉన్న తిరుగులేని ఆధిక్యం అతన్ని మరోసారి 'రారాజు'గా నిలబెట్టింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్ చేసిన వ్యక్తులు

డొనాల్డ్ ట్రంప్, టేలర్ స్విఫ్ట్, డ్రేక్, ఎలాన్ మస్క్, క్రిస్టియానో రొనాల్డో, విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య
జెమిమా రోడ్రిగ్స్, అభిషేక్ శర్మ

Story first published: Wednesday, December 31, 2025, 13:06 [IST]
Other articles published on Dec 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+