వామిక ఫేస్ రివీల్..
ఈ టైమ్‌లో కెమెరాలన్నీ అటు వైపే ఫోకస్ చేయడంతో తొలిసారి వామిక రూపం అందరికి కనబడింది. ఇన్నాళ్లు తమ బిడ్డ మీడియా కంటపడకుండా కోహ్లీ, అనుష్క శర్మ చాలా జాగ్రత్త పడ్డారు మొన్ననే ఫస్ట్ బర్త్‌డే చేసుకున్న వామిక సడన్‌గా టీవీలో కనిపించడంతో ఆ వీడియోలు, స్క్రీన్ షాట్స్ నెట్‌లో వైరల్ అయ్యాయి. అచ్చం చిన్నప్పటి కోహ్లీ లెక్కనే ఉన్న వామికను చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు. మరికొందరూ మాత్రం కోహ్లీ-అనుష్క వద్దనుకున్నా వాళ్ల బిడ్డను టీవీలో చూపించిన బ్రాడ్‌కాస్టర్‌ను తిడుతున్నారు.
వివాదంలో విరాట్..
వామికా వ్యవహారాన్ని పక్కనబెడితే.. మ్యాచ్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ చేసిన ఓ పని అతన్ని వివాదంలో చిక్కుకునేలా చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో విరాట్ చూయింగ్ గమ్ నమలడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీనే జాతీయగీతాన్ని లైట్ తీసుకుంటే ఈ జనరేషన్ ఎలా అర్థం చేసుకుంటుందని, ఇంత బాధ్యతారాహిత్యమా? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారత్ పరువు పోయింది..
రెండో వన్డేతో సిరీస్ పోయింది. ఇప్పుడు ఆఖరి ఓటమితో పరువు పోయింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలై సిరీస్‌ను 0-3తో చేజార్చుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ డికాక్ ( 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 124) సెంచరీ సాధించాడు. డసెన్ (59 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 54) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌటైంది.

దీపక్ చాహర్ పోరాడినా..
విరాట్ కోహ్లీ(84 బంతుల్లో 5 ఫోర్లతో 65), శిఖర్ ధావన్(73 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 61) అర్ధసెంచరీలతో రాణించారు. 32వ ఓవర్లో జట్టు స్కోరు 156 పరుగుల వద్ద కోహ్లీ అవుట్ కావడంతోనే క్లీన్‌స్వీప్ ఖాయమైనప్పటికీ... దీపక్ చహర్ (34 బంతుల్లో 5 బౌండరీలతో 2 సిక్స్‌లతో 54) మెరుపు బ్యాటింగ్‌తో గెలుపుబాట పట్టింది. 18 బంతుల్లో భారత్ విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో 48వ ఓవర్ తొలి బంతికి చహర్‌ను ఎన్‌గిడి బోల్తా కొట్టించడంతో టీమిండియా ఓడిపోయేందుకు ఎక్కువసేపు పట్టలేదు.


Click it and Unblock the Notifications












