For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli కూతురిని రేప్‌ చేస్తానంటూ బెదరింపులకు దిగిన హైదరాబాదీ అరెస్ట్! నిందితుడు ఐఐటీ..

Virat Kohli Daughter Rape Case Threat: 23 Year Old Hyderabad Man Arrested By Mumbai Police

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని రేప్ చేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా పిచ్చి కూతలు కూసిన దుండగుడిని ముంబై ‌సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ దుండగుడు హైదరాబాద్‌కు చెందినవాడే కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. కోహ్లీ కూతురి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల అలిబత్తిని రాంనాగేశ్‌గా గుర్తించిన పోలీసులు అతన్ని ముంబైకి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. నిందితుడు ఐఐటీ పట్టభద్రుడని, ప్రస్తుతం ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడని ముంబై క్రైమ్ పోలీసులు మీడియాకు తెలిపారు.

షమీకి అండగా నిలిచినందుకుక..

షమీకి అండగా నిలిచినందుకుక..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీనే కారణమంటూ ఓ వర్గం అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. అతని మతాన్ని ప్రస్తావిస్తూ జుగుప్సాకరంగా కామెంట్లు చేశారు. ఈ ట్రోలింగ్‌పై రాజకీయంగా కూడా దుమారం రేగింది. ఈ విషయంలో మహమ్మద్ షమీకి మద్దతుగా నిలిచిన విరాట్ కోహ్లీ.. వెన్నెముకలేని వెదవలే ఇలాంటి కామెంట్స్ చేస్తారని, ఫేక్ ఐడీలతో ట్రోలింగ్‌కు పాల్పడుతారని మండిపడ్డాడు. దాంతో విరాట్ కోహ్లీ కుటుంబాన్ని టార్గెట్ చేసిన ట్రోలర్స్ అతని కూతురిపై అత్యంత జుగుప్సాకరమైన రీతిలో రేప్ చేస్తామంటూ కామెంట్లు పెట్టారు.

వామికాను రేప్ చేస్తా..

వామికాను రేప్ చేస్తా..

'విరాట్ కోహ్లీ, అనుష్క శర్మా.. మీరు సిగ్గుతో తలదించుకోవాలి.. మీ కూతురు(వమిక) ఫొటోలను ఎప్పుడెప్పుడు చూపిస్తారా.. ఎప్పుడు తనను రేప్ చేస్తానా అని ఎదురు చేస్తున్నా..'అంటూ క్రిక్ క్రేజీ గర్ల్స్ అనే ట్విటర్ యూజర్ బాహాటంగా కామెంట్లు పెట్టాడు. ఈ ట్వీట్ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తొమ్మిది నెలల పసికందు వామికాను రేప్ చేస్తానంటూ ఇంత దారుణంగా దూషణలకు దిగడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుండగుడిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీ కార్యాలయానికి ట్యాగ్స్ చేశారు. ఇక ఢిల్లీ మహిళా కమీషన్ సైతం ఈ ట్రోలింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా కామెంట్లు చేసిన వారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని.. వారి తాట తీసి ఎఫ్‌ఐఆర్ కాపీ తమకు అందించాలని ఆదేశించింది.

ఫ్యాక్ట్ చెకర్ సాయంతో..

ఫ్యాక్ట్ చెకర్ సాయంతో..

కోహ్లీ కూతురిని ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడిన దుండగుడిది పాకిస్తాన్ అని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఫ్యాక్ట్ చెకర్, ప్రఖ్యాత ఆల్ట్ న్యూస్ కో-ఫౌండరైన మొహ్మద్ జుబేర్ మాత్రం ఆ దుండగుడిది హైదరాబాదే అని తేల్చేశారు. క్రిక్ క్రేజీ గర్ల్స్, రమన్ హెయిస్ట్, పెళ్లికూతురుహిరయ్ అనే పేర్లు గల ట్విటర్ అకౌంట్లతో ట్రోలింగ్ కు పాల్పడుతోన్న వ్యక్తి ఒకడేనని, ఆ మూడు అకౌంట్లకు డేటా యూజర్ ఐడీ ఒకటేనని, ఆ వ్యక్తి హైదరాబాద్ కు చెందినవాడేనని జుబేర్ పేర్కొన్నారు. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

తప్పించుకునే ప్రయత్నం..

తప్పించుకునే ప్రయత్నం..

ముందుగా ramanheist అనే ఐడీతో ట్విటర్ అకౌంట్ తెరిచిన దుండగుడు.. ఇటీవల దాన్ని criccrazyygirl‌గా మార్చి పాకిస్థాన్ అభిమాని అకౌంట్‌గా చిత్రీకరించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ఫ్యాక్ట్ చెకర్స్ ఇది పాకిస్థాన్ అభిమాని అకౌంట్ కాదని, హైదరాబాద్ వ్యక్తిదేనని స్పష్టం చేసింది. అయితే ఓ ఐఐటీ పట్టు భద్రుడు తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక ఇలాంటి జుగుప్సాకరమైన కామెంట్స్ దిగడం కలవరపెడుతోంది.

Story first published: Wednesday, November 10, 2021, 18:37 [IST]
Other articles published on Nov 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+