Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను దగ్గినా వార్త అవుతోంది.. ఇదేం దిక్కుమాలిన కల్చర్: విరాట్ కోహ్లీ

ఐపీఎల్‌లో కంటెంట్ కల్చర్ శృతి మించిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానం వరకు తాను ఎవరితో మాట్లాడినా వార్త అవుతుందన్నాడు. తమ చుట్టూ నిరంతరం కెమెరాల నిఘా ఉండటంతో స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోతున్నామని తెలిపాడు. ఈ అతి కల్చర్ ఆటగాళ్లకు అసౌకర్యంగా మారిందని అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో దుమ్మురేపుతున్న విరాట్ కోహ్లీ.. తాజాగా మయాంతి లాంగర్ హోస్ట్‌గా వ్యవహరించిన 'ఆర్‌సిబి పాడ్‌కాస్ట్'‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కంటెంట్ క్రియేషన్ కోసం ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్ చేస్తున్న పనులను కోహ్లీ తప్పుబట్టాడు. వారి అతి కారణంగా తన ఫ్రెండ్ కేన్ విలియమ్సన్‌తో మనసు విప్పి మాట్లాడలేకపోయానని ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. ఈ దిక్కుమాలిన కల్చర్‌పై నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డాడు.

హద్దులు దాటిన కంటెంట్ క్రియేషన్

'నాకు ఆటలో ఉండే ఒత్తిడి అంటే ఇష్టం. నిజాయితీగా చెప్పాలంటే దీన్ని తప్పా మరే ఒత్తిడిని నేను ఇష్టపడను. ఏ జట్టుకైనా కమర్షియల్ ప్రమోషన్స్, అభిమానులను ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా మంచి వేదిక. ఇది అర్థం చేసుకోదగిన విషయమే. కానీ ఈ కంటెంట్ క్రియేషన్‌పై కాస్త నియంత్రణ ఉండాలి. జట్ల అధికారిక ఫ్యాన్ క్లబ్స్, అధికారిక ఫ్యాన్ పేజీలు ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచే ఊపందుకున్నాయి తప్పా అంత ముందుకు లేవనే విషయం గ్రహించాలి.

Virat Kohli Criticizes IPL s Content Culture Calls for Privacy and Boundaries for Players
Photo Credit: RCB(X)

ఆధునిక బ్రాడ్‌కాస్టింగ్ విధానం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు నిరంతరం కంటెంట్ అందించడంపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఆటగాళ్ల నుంచి నింతరం ఫుటేజ్ కోసం డిమాండ్ చేయడం వల్ల.. సహజమైన వాతావరణం దెబ్బతింటుంది. ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం బయటికి రాగానే చుట్టూ కెమెరాలు వెంబడిస్తున్నాయి. ఇది ఆటగాళ్లకు చాలా అసౌకర్యంగా ఉంటుంది.

స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం..

ఓ ఆటగాడికి ప్రశాంతమైన వాతావరణంలో తన ఆటను మెరుగుపర్చుకునే అవకాశం, స్వేఛ్చ ఉండాలి. కానీ అలా కాకుండా ఆటగాడు చేసే ప్రతీ పనిని రికార్డ్ చేస్తూ, విశ్లేషిస్తూ ఉంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేయలేరు. ఎందుకంటే దాన్ని కూడా ఎవరైనా రికార్డ్ చేస్తే.. వాటిపై కూడా చర్చలు చేస్తారనే భయం వారిలో ఉంటుంది.

మ్యాచ్ సమయంలో ఆటగాళ్ల ఆటను బట్టి అంచనా వేయాలి. కానీ మ్యాచ్‌కు ముందు ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు? నెట్స్‌లో ఎలాంటి షాట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారనే విషయాలను చర్చిస్తూ విమర్శించడం సరికాదు. కాబట్టి ఆటగాళ్లను నిరంతరం కెమెరాల నిఘాలో ఉంచడం వారికి ఇష్టమేనా అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య ఇది చాలా ఎక్కువైంది.

నా ఫ్రెండ్‌తో మాట్లాడలేకపోతున్నా..

మొన్న నేను కేన్ విలియమ్సన్‌తో మాట్లాడుతుంటే.. రోబో వచ్చింది. కేన్ నాకు మంచి మిత్రుడు. అతనితో ఏదో సీరియస్‌గా చర్చిస్తుంటే.. ఈ రొబో(చంపక్) మమ్మల్ని షూట్ చేస్తుంది. నేను వెంటనే దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తితో పక్కకు వెళ్లాలని చెప్పాను. కేన్ నా ఫ్రెండ్. ప్రశాంతంగా మాట్లాడనివ్వండని కోరాను.

'కేన్ మామతో కింగ్ కోహ్లీ'అనే ఒక మూమెంట్‌గా మారకుండా నేను అతనితో మాట్లాడలేకపోతున్నాను. కేన్ నాకు అండర్ 19 రోజుల నుంచి తెలుసు. అతనితో స్వేచ్ఛగా మాట్లాడటానికి నాకు కొంచెం ప్రైవసీ కావాలి. డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానం వరకు నేను ఎవరితో మాట్లాడినా అది వార్త అయిపోతుంది. ఇది నాకు అసౌకర్యంగా, అతిగా అనిపిస్తుంది.'అని విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.

Story first published: Saturday, May 16, 2026, 18:21 [IST]
Other articles published on May 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+