Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. హాఫ్ సెంచరీతో వరల్డ్ రికార్డ్ బద్దలు!

బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్న విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. మరో వరల్డ్ రికార్డ్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 16 వేల పరుగుల మైలురాయి అందుకున్న కోహ్లీ.. తాజాగా అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.

ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ‌లో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్‌లో గుజరాత్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 77 పరుగులు చేసాడు. గుజరాత్ బౌలర్ విశాల్ జైస్వాల్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్‌గా వెనుదిరిగి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.

ప్రస్తుతం కోహ్లీ లిస్ట్-ఏ క్రికెట్‌లో 57.87 సగటుతో 16,207 పరుగులు చేశాడు. లిస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక బ్యాటింగ్ యావరేజ్. ఈ క్రమంలో కోహ్లీ ఆస్ట్రేలియా లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ మైఖేల్ బేవన్ రికార్డ్‌ను అధిగమించాడు. మైఖేల్ బేవన్ 57.86 సగటుతో 15,103 పరుగులు చేశాడు.

Virat Kohli Creates History Breaks Major World Record With 77 Against Gujarat in Vijay Hazare Trophy

లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ కలిగిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. 344 మ్యాచ్‌లు.. 331 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 57.87 సగటుతో 16,207 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మైఖేల్ బేవన్ 427 మ్యాచ్‌లు, 385 ఇన్నింగ్స్‌ల్లో 57.86 సగటుతో 15,103 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ బ్యాటర్ సామ్యూల్ హైన్ 62 ఇన్నింగ్స్‌ల్లో 57.76 సగటుతో 3004 రన్స్ నమోదు చేశాడు. చతేశ్వర్ పుజారా 127 ఇన్నింగ్స్‌ల్లో 57 సగటుతో 5759, రుతురాజ్ గైక్వాడ్ 89 ఇన్నింగ్స్‌ల్లో 56.68 సగటుతో 4648 పరుగులతో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు.

ఆంధ్రతో జరిగిన తొలి విజయ్ హజారే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(133) సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌తో 16వేల పరుగుల మైలురాయి అందుకున్న కోహ్లీ.. ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాటర్‌గా.. నాలుగో ఆసియా ప్లేయర్‌గా.. ఓవరాల్‌గా 9వ ఆటగాడిగా నిలిచాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.

Story first published: Friday, December 26, 2025, 16:32 [IST]
Other articles published on Dec 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+