
ధావన్, రోహితే ఓపెనర్లు:
మ్యాచ్‌కు ముందు రోజు జరిగే వర్చువల్ ప్రెస్ మీట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. 'మంగళవారం నుంచి పూణేలో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోంది. కచ్చితంగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మలే ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారు. వన్డేల విషయంలో ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. రోహిత్-ధావన్ కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నారు. మా మొదటి ప్రాధాన్యత వారికే' అని కోహ్లీ తెలిపాడు. ఇక టీ20ల్లో విఫలమయిన కేఎల్ రాహుల్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

సూర్యకుమార్ ఆడితే:
భవిష్యత్తులో కూడా రోహిత్ శర్మతో కలిసి శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేస్తాడా? అన్న ప్రశ్నకు.. 'ఏమో చెప్పలేం. ఇప్పుడే హామీ ఇవ్వలేను' అని విరాట్ కోహ్లీ సమాధానం ఇచ్చాడు. టాప్ ఆర్డర్‌లో చోటు కల్పించే విధంగా సూర్యకుమార్ యాదవ్ ఆడితే.. అతడి కోసం ఏదైనా చేయాలని కోహ్లీ పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఒకవేళ ఒకవేళ సూర్య వన్డేల్లో ఆడాలంటే కచ్చితంగా శ్రేయాస్ అయ్యర్‌ను పక్కనపెట్టాల్సిందే. కెప్టెన్ కోహ్లీ ఈ సాహసం చేయకపోవచ్చు. ఎవరికీ అవకాశం దక్కుతుందో చూడాలి.

సెకండ్ బెస్ట్:
ఇప్పటి వరకూ చూస్తే భారత్ తరఫున రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ది మూడో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ. రోహిత్-ధావన్ 109 ఇన్నింగ్స్‌లలో 44.87 సగటుతో 4,878 పరుగులు చేశారు. అందులో ఓపెనర్లుగా 107 ఇన్నింగ్స్‌ల్లో 4,802 పరుగులు చేశారు. ఇది ఇండియా తరఫున వన్డే క్రికెట్‌లో సెకండ్ బెస్ట్. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ ఓపెనింగ్ జోడీ 6609 పరుగులు చేసింది. గబ్బర్ ఇటీవలి కాలంలో గాయాల కారణంగా జట్టుకు దూరమయిన రోజులే ఎక్కువగా ఉన్నాయి. 2019 ప్రపంచకప్ నుంచి అతడు వరుసగా గాయపడుతున్నాడు.

ధావన్‌కు ఈ వన్డే సిరీస్ కీలకం:
టీ20ల్లో ఓపెనర్‌గా విఫలమైన శిఖర్ ధావన్‌కు వన్డే సిరీస్ కీలకం కానుంది. శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ వంటి కుర్రాళ్లతో అతడికి గట్టి పోటీ నెలకొంది. అందుకే అతడీ సిరీసులో రాణించడం అత్యంత అవసరం. టీ20లతో పోలిస్తే వన్డేల్లో క్రీజులో నిలదొక్కుకొనేందుకు తగిన సమయం ఉండటం కలిసొచ్చే అంశం. మూడు వన్డేల్లో రాణించి.. ఐపీఎల్ 2021లో అదరగొడితే గబ్బర్‌కు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడని అనడంలో సందేహం లేదు.

తొలి వన్డేకి భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేందర్ చహల్, టీ నటరాజన్.
India vs England: కోహ్లీ-బట్లర్ గొడవపై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంతకీ ఏమన్నాడంటే?


Click it and Unblock the Notifications












