
సిరాజ్ ఫిట్‌గా లేడు..
ఈ మ్యాచ్ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. టీమ్ కాంబినేషన్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిర్లక్ష్యపు షాట్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రిషభ్ పంత్‌ను వెనుకేసుకొచ్చాడు. కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చిన పుజారా, రహానేలను కొనియాడాడు. టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యతను వివరించాడు. ‘‘నేను పూర్తి ఫిట్‌నెస్ సాధించాను. మహమ్మద్ సిరాజ్ మాత్రం మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేడు. ఈ రోజు జరిగే సమావేశంలో అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలో చర్చిస్తాం. నిజానికి సిరాజ్ స్థానాన్ని భర్తీ చేయడానికి మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నిజంగా ఇది మాకు గర్వకారణం'' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

పంత్ నేర్చుకుంటాడు..
క్రికెట్‌లో తప్పులు చేయడం సహజమని, రిషభ్ పంత్ సైతం తన తప్పిదాల నుంచి గుణ పాఠం నేర్చుకుంటాడని విరాట్ కోహ్లీ తెలిపాడు. ‘రిషభ్ పంత్ తన తప్పులను సరిదిద్దుకుంటాడు. మేటి క్రికెటర్‌గా తనను తాను నిరూపించుకుంటాడు. ప్రాక్టీస్ సెషన్‌లో తనతో మేము ఇప్పటికే మాట్లాడాం. పరిస్థితుల తగ్గట్లు ఆడాలని చెప్పాం. అతను పరిణతి కలిగిన ఆటగాడు. కచ్చితంగా పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు.'' అని చెప్పిన కోహ్లీ.. మూడో టెస్టుకు పంత్ తుది జట్టులో ఉంటాడని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.

బలవంతంగా తీసేయవద్దు..
ఇక సీనియర్ బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే ఫామ్‌లోకి రావడంపై సంతోషం వ్యక్తం చేసిన కోహ్లీ.. ‘‘జట్టులో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే అవి సహజంగా జరగాలే గానీ.. బలవంతంగా మార్పులు చేయకూడదు. ఎప్పుడూ ఆటగాళ్ల రికార్డులు, నంబర్స్, మైలురాళ్ల ఆధారంగా తీర్పునిస్తారు. కానీ క్లిష్ట పరిస్థితుల్లో ఆటగాళ్లు రాణించిన ప్రాముఖ్యతను గుర్తించాలి.''అని అన్నాడు. మూడో టెస్టు నేపథ్యంలో రహానే, పుజారా తుది జట్టులో ఉంటారని చెప్పకనే చెప్పాడు. కాగా కేప్‌టౌన్ వేదికగా జరిగే నిర్ణయాత్మక మూడో టెస్టు జనవరి 11న ఆరంభం కానుంది.

ఆ పిచ్చి ఉండాలి..
టెస్ట్ క్రికెట్‌లో రాణించాలంటే ఆట పట్ల పిచ్చి, అభిమానం, మక్కువ ఉండాలని కోహ్లీ తెలిపాడు. ఇవి లేకపోతే సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించడం కష్టమన్నాడు. ‘టెస్ట్ క్రికెట్ పట్ల అభిరుచి, నిబద్ధత, ప్యాషన్ లేకపోతే ఈ ఫార్మాట్‌లో రాణించడం కష్టం. ఈ ఫార్మాట్‌కు సంకల్ప బలంతో పాటు కమిట్‌మెంట్, ఆట పట్ల ఇష్టం అవసవరం. వన్డే, టీ20 క్రికెట్‌తో పోలిస్తే టెస్ట్ ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. నేను భారత కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించేటప్పుడు టీమిండియా ఏడో స్థానంలో ఉంది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నేను చూశా. కానీ ఆట పట్ల ఉన్న మక్కువతో సమష్టిగా రాణించి గత నాలుగేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాం'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
