Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Test rankings: టాప్ ర్యాంక్ జస్ట్ మిస్.. రెండులోనే కోహ్లీ.. అశ్విన్ పైకి.. బుమ్రా కిందికి!

Virat Kohli Closes Gap On Steve Smith Atop ICC Test Batting Rankings

దుబాయ్‌ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొద్దిలో టాప్ ర్యాంక్ చేజార్చుకున్నాడు. బ్యాటింగ్‌ విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ 901 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. విరాట్‌ కోహ్లీ 888 పాయింట్లతో రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌట్‌ అయిన కోహ్లీసేన.. అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది.

చెత్త ప్రదర్శన..

చెత్త ప్రదర్శన..

పింక్‌బాల్ టెస్టులో టీమిండియా ఆటగాళ్ల చెత్త ప్రదర్శన ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో స్పష్టంగా కనిపించింది. ఒకవేళ కెప్టెన్‌ కోహ్లీ ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టులో సెంచరీ చేసి ఉంటే తొలిస్థానాన్ని అందుకునేవాడు. కానీ మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేయడం.. రెండో ఇన్నింగ్స్‌లో 4పరుగులకే వెనుదిరగడంతో రెండు పాయింట్లు సాధించి 888 పాయింట్లతో 2వ స్థానంలోనే ఉన్నాడు.

 పుజారా ర్యాంకు..

పుజారా ర్యాంకు..

ఇక ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ తొలి టెస్టులో అంతగా ఆకట్టుకోకపోయినా మొదటిస్థానాన్ని నిలుపుకున్నాడు. విరాట్‌కు అతనికి కేవలం మూడు పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఆసీస్‌తో టెస్టుకు ముందు 7వ స్థానంలో ఉన్న పుజారా ఒకస్థానం దిగజారి 8వ స్థానంలో నిలిచాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్న కేన్‌ విలియమ్సన్‌ మూడో స్థానానికి చేరుకోగా.. కోహ్లీ, విలియమ్సన్‌ల మధ్య కేవలం 11 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.

టాప్-5‌లో హేజల్‌వుడ్

టాప్-5‌లో హేజల్‌వుడ్

ఇక బౌలింగ్‌ విభాగంలో పింక్‌బాల్‌ టెస్టులో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న హేజల్‌వుడ్‌ ఏకంగా 5వ స్థానానికి చేరుకోగా.. మరో ఆసీస్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ 910 పాయింట్లో అగ్రస్థానాన్ని ​కాపాడుకున్నాడు. భారత్‌ బౌలర్లలో అశ్విన్‌ ఒక స్థానం మెరుగుపరుచుకొని 9వ స్థానంలో నిలిచాడు. పింక్‌బాల్‌ టెస్టుకు ముందు 8వ స్థానంలో ఉన్న బుమ్రా రెండు స్థానాలు దిగజారి హోల్డర్‌తో కలిసి సంయుక్తంగా 10వ స్థానంలో నిలిచాడు.

ఫ్లాఫ్ 36..

ఫ్లాఫ్ 36..

రెండేళ్ల క్రితం ఇదే మైదానంలో అద్భుత విజయంతో ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ప్రారంభించిన భారత్‌ ఇప్పుడు అక్కడే పరాజయంతో సిరీస్‌లో వెనుకంజ వేసింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌటైంది. జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. పేసర్లు జోష్‌ హెజల్‌వుడ్‌ (5/8), ప్యాట్‌ కమిన్స్‌ (4/21) భారత జట్టు వెన్నువిరిచారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 53 పరుగులు కలిపి భారత్‌ ఓవరాల్‌ స్కోరు 89 పరుగులకు చేరింది. 90 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ ఆడుతూ పాడుతూ ఛేదించింది. 21 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 2 వికెట్లకు 93 పరుగులు సాధించి గెలిచింది.

Story first published: Sunday, December 20, 2020, 17:36 [IST]
Other articles published on Dec 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+