
క్లారిటీ లేదు..
వన్డే కెప్టెన్సీ మార్పు విషయంలో బీసీసీఐ నుంచి తనకు స్పష్టమైన సమాచారం అందలేదని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 'టెస్ట్ టీమ్ ఎంపికకు సరిగ్గా గంటన్నర ముందు వన్డే కెప్టెన్సీ మార్పుపై సెలెక్టర్లు నాతో మాట్లాడారు. ఐదుగురు సెలెక్టర్లు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అంతే తప్పా నాకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. వన్డే సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వాలని నేను కోరినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. నేను అసలు విశ్రాంతే కోరలేదు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు అందుబాటులో ఉంటా.

వద్దని ఎవరూ చెప్పలేదు..
టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని బీసీసీఐకి చెప్పినప్పుడు వద్దని నన్నెవరు వారించలేదు. ఈ విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదు. టీమ్ పురోగతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాను. వన్డే, టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని చెప్పాను. నా నుంచి స్పష్టమైన సమాచారం అందంచాను. బీసీసీఐ ఆఫిస్ బేరర్స్‌తో పాటు సెలెక్టర్లకు ఈ విషయం చెప్పాను. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటే వన్డే కెప్టెన్సీ కూడా వదులుకోవాల్సి వస్తుందని అప్పుడు నాకు ఎవరూ చెప్పలేదు. ఐసీసీ ట్రోఫీలు గెలవలేదనే సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకోవచ్చు.

రోహిత్‌కు నా సపోర్ట్...
వారి లాజికల్ పాయింట్‌ను నేను అర్థం చేసుకోగలను. నాకు, రోహిత్ శర్మకు ఎలాంటి విభేధాల్లేవ్. ఈ విషయంపై గత రెండేళ్లుగా స్పష్టత ఇస్తూనే ఉన్నా. ఈ రూమర్లతో నేను విసిగిపోయా. నేనెప్పుడూ టీమ్‌ను సరైన దిశలో తీసుకెళ్లేందుకే ప్రయత్నిస్తా. అంతే తప్పా టీమ్‌కు నష్టం చేసే పనులు అస్సలు చేయను. రోహిత్ శర్మ మంచి సత్తా కలిగిన సారథి. వ్యూహాలు రచించడంలో దిట్ట. అతనికి అండగా గొప్ప వ్యక్తయిన రాహుల్ భాయ్ ఉన్నాడు. వన్డే, టీ20ల్లో ఈ ఇద్దరికి 100 శాతం నా మద్దతు ఉంటుంది.'అని కోహ్లీ స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications
