ఐదో భారత క్రికెటర్: హాల్ ఆఫ్ ఫేమ్‌లో ద్రవిడ్

హైదరాబాద్: అండర్ 19 .. భారత్ ఏ జట్టులకు కోచ్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఐదో భారత ప్లేయర్‌గా ద్రవిడ్ ప్రత్యేక హోదాను పొందాడు. గురువారం ఇండియా, వెస్టిండీస్ మధ్య ఐదో వన్డే ప్రారంభమయ్యే ముందు తిరువనంతపురం వేదికగా మరో లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా ద్రవిడ్ జ్ఞాపిక అందుకున్నాడు.

ద్రవిడ్ కంటే ముందు నలుగురు మాత్రమే
ద్రవిడ్ కంటే ముందు కేవలం నలుగురు భారత క్రికెటర్లకు మాత్రమే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. ఇంతకుముందు గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలు మాత్రమే ఈ గౌరవం దక్కించుకున్నారు. సునీల్ గవాస్కర్(2009), బిషన్ సింగ్ బేడీ(2009), కపిల్ దేవ్(2009)లకు కుంబ్లేకు 2015లో హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది.

పాంటింగ్ 25వ ఆస్ట్రేలియన్‌గా పురస్కారాన్ని
ఇదే సందర్భంగా అవార్డు అందుకున్న పాంటింగ్ 25వ ఆస్ట్రేలియన్‌గా పురస్కారాన్ని అందుకున్నాడు. ఇంగ్లాండ్ నుంచి అవార్డు అందుకున్న టేలర్ మూడో ఇంగ్లీష్ మహిళా ప్లేయర్‌గా.. ఏడో మహిళా ప్లేయర్‌గా అవార్డు అందుకుంది.

అరుదైన గౌరవంగా భావిస్తా.. కృతజ్ఞతలు
సంవత్సరారంభంలో హాల్ ఆఫ్ ఫేమ్ గురించి మాట్లాడిన ద్రవిడ్.. ఆ హోదా దక్కించుకోవడం ఓ అరుదైన గౌరవంగా భావిస్తా. ఏ ఆటగాడికైనా గొప్ప క్రికెటర్ల జాబితాలో పేరు నిలిచిపోవడమనేది కల. తర్వాతి జనరేషన్స్‌కి కూడా గుర్తుండిపోతుంది. నా ఇంత ప్రోత్సాహన్నందించిన వాళ్లందరికీ కృతజ్ఞతలు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వారికి ఇంతకంటే మంచి బహుమతి వేరే ఏముంటుంది.

ద్రవిడ్ ప్లేయర్‌గా తన కెరీర్‌లో:
భారత్ తరఫున 2018లో చోటు దక్కించుకన్న ద్రవిడ్ 164 టెస్టులు, 344 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 13288, వన్డేల్లో 10889 పరుగులు చేశాడు. టెస్టుల్లో 36, వన్డేల్లో 12 సెంచరీలు చేశాడు. 2004లో అతడు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications