51 సంవత్సరాల తర్వాత.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు!!

అడిలైడ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరొక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో కోహ్లీ (74: 180 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అర్ధ శతకం చేసే క్రమంలో కోహ్లీ ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే ఈ రికార్డు బ్రేక్ చేయడానికి ఒకటి రెండు కాదు.. ఏకంగా 51 సంవత్సరాలు పట్టింది. దిగ్గజ కెప్టెన్లకు సాధ్యంకాని రికార్డును విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

పటౌడీ రికార్డు బ్రేక్
ఇంతకముందు ఆస్ట్రేలియాపై కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాజీ ఆటగాడు ఎంఏకే పటౌడీ పేరిట ఉంది. ఆసీస్‌తో భారత్ ఆడిన 40 టెస్ట్ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన పటౌడీ.. 829 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ మాత్రం 10 టెస్టులకు నాయకత్వం వహించి 851 పరుగులు చేసి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై నాలుగు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు చేశాడు. ఇక 50.05 సగటుతో పరుగులు చేశాడు.

అడిలైడ్‌లో అత్యధిక రన్స్
విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ తన టెస్టు కెరీర్లో అడిలైడ్ ఓవల్ మైదానంలోనే అత్యధిక రన్స్ సాధించాడు. అడిలైడ్ మైదానంలో కోహ్లీ 500 పరుగులను పూర్తిచేసుకున్నాడు. దీంతో అడిలైడ్ ఓవల్‌లో టెస్ట్ క్రికెట్లో 500 పరుగులు పూర్తి చేసిన 4వ నాన్ ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా విరాట్ రికార్డుల్లోకి ఎక్కాడు. సాధారణంగా ఏ ఆటగాడైనా అలవాటైన స్వదేశీ పిచ్‌లపై ఎక్కువ పరుగులు చేస్తుంటారు. అయితే అందరికన్నా భిన్నంగా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ విదేశీ గడ్డపై ఒకే మైదానంలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేయడం విశేషం.

బొటనవెలికి గాయం
ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయకముందే గాయానికి గురయ్యాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కోహ్లీ బొటనవెలికి గాయమైంది. 43వ ఓవర్లో స్టార్క్ బౌన్సర్ సాధించగా.. విరాట్ డిఫెన్స్ ఆడాడు. బంతి కాస్తా కోహ్లీ కుడిచేయి బొటనవెలికి బలంగా తాకింది. వెంటనే విరాట్ గ్లోవ్ తీసేసి విలవిల్లాడు. బొటనవేలుకు రక్తస్రావం అయింది. టీమిండియా ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స చేశాడు. అనంతరం కోహ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. ఆపై హాఫ్ సెంచరీ చేశాడు. అయితే అజింక్య రహానేతో సమన్వయలోపం వల్ల విరాట్ రనౌట్ అయ్యాడు.
India vs Australia: అయ్యో పుజారా.. 10 సార్లు అతని బౌలింగ్‌లోనే!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications