26 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

ట్రినిడాడ్: ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తుంటాడు భారత కెప్టెన్ 'రన్ మెషిన్' విరాట్ కోహ్లీ. మిగతా బ్యాట్స్‌మెన్ అర్ధ సెంచరీలతో సరిపెట్టుకుండుండగా.. కోహ్లీ మాత్రం సెంచరీ బాదేస్తుంటాడు. కోహ్లీ దాటికి ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఆదివారం వెస్టిండీస్‌తో క్వీన్స్‌పార్క్ ఓవల్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో కూడా కోహ్లీ మరో రికార్డును బ్రేక్ చేసాడు.

అత్యధిక పరుగుల వీరుడు:
వన్డే ఫార్మాట్‌లో వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 26 ఏళ్లుగా పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు జావేద్ మియాందాద్ (1930 పరుగులు) పేరున ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 19 వద్ద కోహ్లీ.. మియాందాద్ రికార్డును బ్రేక్ చేశాడు. కోహ్లీ 34 మ్యాచ్‌ల్లోనే 71 సగటుతో ఈ ఘనత సాధించాడు.

రెండో స్థానంకి మియాందాద్:
ఇప్పటివరకు విండీస్‌పై అత్యధికంగా కోహ్లీ 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. కోహ్లీ తొలి వన్డే, తొలి సెంచరీ కూడా విండీస్‌పైనే చేయడం కావడం విశేషం. కోహ్లీ దెబ్బకు మియాందాద్ (64 మ్యాచ్‌ల్లో 1930 పరుగులు) రెండో స్థానంకి పడిపోయాడు. మార్క్ వా (ఆస్ట్రేలియా ) 45 ఇన్నింగ్స్‌లో 1708 పరుగులు, జాక్వెస్ కలీస్ (దక్షిణాఫ్రికా) 40 ఇన్నింగ్స్‌లో 1666, రమీజ్ రాజా (పాకిస్థాన్) 53 ఇన్నింగ్స్‌లో 1624 పరుగులతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
కోహ్లీ, భువనేశ్వర్ షో.. రెండో వన్డేలో భారత్ విజయం

కోహ్లీ సెంచరీ:
బ్యాట్‌తో విరాట్ కోహ్లీ (120; 125 బంతుల్లో 14×4, 1×6), బంతితో భువనేశ్వర్ కుమార్ (4/31) చెలరేగడంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత ఇన్నింగ్స్ అనంతరం వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270కి సవరించారు. టార్గెట్ ఛేజింగ్‌కు దిగిన విండీస్ భారత బౌలర్ల ధాటికి 42 ఓవర్లలో 210 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ లూయిస్ (65; 80బంతుల్లో 8×4, 1×6), నికోలస్ పూరన్ (42; 52బంతుల్లో 4×4, 1×6)లు రాణించారు. భారత బౌలరల్లో షమీ (2/39), కుల్దీప్(2/59) ఆకట్టుకున్నారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0తో బోణీ కొట్టింది. మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications