Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంపాదనలో టాప్-10 ఆటగాళ్లు వీరే.. క్రికెట్ నుంచి కోహ్లీ ఒక్కడే!

ప్రపంచంలోనే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యధికంగా డబ్బులు సంపాదించిన క్రికెటర్‌గా నిలిచాడు. గత 12 నెలల కాలంలో అతను దాదాపు రూ. 847 కోట్లు ఆర్జించాడు. గత 12 నెలల కాలంలో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించిన టాప్-10 క్రీడాకారుల జాబితాను స్టాటిస్టా అనే జర్మన్ డేటా కంపెనీ ప్రకటించింది. ఈ జాబితాలో క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ మాత్రం చోటు దక్కించుకున్నాడు.

రూ. 847 కోట్ల సంపదతో అతను 9వ స్థానంలో నిలిచాడు. ఇక రూ.2081 కోట్ల రూపాయాలతో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో అగ్రస్థానంలో నిలవగా.. స్పానిష్ గోల్ఫర్ జాన్ రామ్ రూ. 1712 కోట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రూ. 1074 కోట్లతో మూడో స్థానంలో ఉండగా.. అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్ లెబ్రోన్ జేమ్స్ 990 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

Virat Kohli becomes the highest paid cricketer in the world in the last 12 months

ఫ్రెంచ్ ఫుట్‌ బాలర్ కైలియన్ ఎంబాపే 881 కోట్లతో ఐదో స్థానంలో నిలవగా.. గ్రీన్-నైజీరియన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ గియాన్నిస్ అంటేటోకౌనుంపో రూ. 873 కోట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. బ్రెజిల్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ రూ. 864 కోట్లు, ఫ్రెంచ్ ఫుట్‌బాలర్ కరీమ్ బెంజెమా రూ. 864 కోట్లు, విరాట్ కోహ్లీ రూ. 847 కోట్లు, అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ స్టీఫెన్ కర్రీ రూ. 831 కోట్లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. మరే క్రికెటర్ కూడా వీరి దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం.

ఐపీఎల్‌తో పాటు టీమిండియాకు ఆడటం ద్వారా కోట్ల రూపాయల వార్షిక వేతనం అందుకుంటున్న కోహ్లీ.. యాడ్స్ ద్వారా అంతకు మూడింత సంపాదనను ఆర్జిస్తున్నాడు. వ్యాపారవేత్తగా మారిన కోహ్లీ క్లోతింగ్ స్టోర్స్, రెస్టారెంట్ బిజినెస్‌, షేర్ మార్కెటింగ్‌లోని పెట్టుబడుల ద్వారా కోట్ల రూపాయాలు సంపాదిస్తున్నాడు.

భారత దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టిన క్రీడాకారుల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా లెక్కల ప్రకారం విరాట్ కోహ్లీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 66 కోట్లు టాక్స్ రూపంలో చెల్లించాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. షారూఖ్ ఖాన్(రూ. 92 కోట్లు), తలపతి విజయ్(రూ. 80 కోట్లు), సల్మాన్ ఖాన్(రూ. 75 కోట్లు), అమితాబ్ బచ్చన్(రూ. 71 కోట్లు) కోహ్లీ కంటే ముందున్నారు.

Story first published: Friday, September 6, 2024, 20:46 [IST]
Other articles published on Sep 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+