Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. ఖాతాలో అరుదైన ఘనత!

పల్లెకెలె: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆసియాకప్ 2023లో భాగంగా నేపాల్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో మల్టీ నేషనల్ టోర్నీల్లో విరాట్ కోహ్లీ 100 క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనతను అందుకున్న రెండో నాన్ వికెట్ కీపర్‌గా కోహ్లీ చరిత్రకెక్కాడు. కోహ్లీ కన్నా ముందు అజారుద్దీన్ ఈ ఘనతను అందుకున్నాడు.

అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే 218 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్(160), మహమ్మద్ అజారుద్దీన్(156) కోహ్లీ కన్నా ముందున్నారు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 274 ఇన్నింగ్స్‌ల్లో 143 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో రాస్ టేలర్(142) రికార్డును అధిగమించాడు.

Virat Kohli One-Handed Catch

మహమ్మద్ సిరాజ్ వేసిన 30వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ ఈ క్యాచ్ అందుకున్నాడు. నేపాల్ ఓపెనర్ ఆసిఫ్ షేక్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ కవర్‌లో సింగిల్ హ్యాండ్‌తో అందుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలో ఇదే సిరాజ్ బౌలింగ్‌లో ఆసిఫ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను విరాట్ కోహ్లీ వదిలేసాడు. సునాయస క్యాచ్‌ను వదిలేసి కష్టతరమైన క్యాచ్‌తో అతన్ని పెవిలియన్ చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఆసిఫ్ షేక్(97 బంతుల్లో 8 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సోంపల్ కమీ(56 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 48) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ కుశాల్ భుర్టెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/61), రవీంద్ర జడేజా(3/40) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్.. నేపాల్‌కు కలిసొచ్చింది.

అనంతరం టీమిండియా బ్యాటింగ్ దిగగా.. వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా చాలా సేపు ఆట ఆగిపోవడంతో మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించి భారత్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 145గా నిర్ణయించారు. ఇక 8 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 91 బంతుల్లో 95 పరుగులు కావాలి.

Story first published: Monday, September 4, 2023, 22:55 [IST]
Other articles published on Sep 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+